అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది: వైఎస్‌ జగన్‌ | YS Jagan Meets YSRCP Supporters At YSR District Live Updates | Sakshi
Sakshi News home page

అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది: వైఎస్‌ జగన్‌

Published Sun, Jul 7 2024 9:37 AM | Last Updated on Sun, Jul 7 2024 9:33 PM

YS Jagan Meets YSRCP Supporters At YSR District Live Updates

Updates..

  • రేపు ఇడుపులపాయకు వైఎస్ జగన్
  • వైఎస్ఆర్ 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొననున్న జగన్
  • వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్న మాజీ సీఎం జగన్‌

  • పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తున్న వైఎస్‌ జగన్‌కు గ్రామగ్రామానా అభిమానాన్ని చాటుకున్న జనం,
  • ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన వైఎస్‌ జగన్‌

  • లింగాల మండలం పెద్దకుడాలకు చేరుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
  • వైఎస్ జగన్‌ను  చూసేందుకు గ్రామంలో రహదారి వెంట బారులు తీరిన జనం
  • గ్రామంలో మాజీ మండల అద్యక్షడు వెంకటసుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ పరామర్శ
  • ఇటీవల వెంకటసుబ్బారెడ్డి సతీమణీ లక్ష్మీనరసమ్మ అనారోగ్యంతో మృతి
  • కార్యక్రమంలో పాల్గొన్న  ఎంపీ అవినాష్‌ రెడ్డి  స్థానిక నాయకులు

 

👉పులివెందులలో పాముకాటుకు గురై మరణించిన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్‌ జగన్‌. చిన్నారికి నివాళులర్పించి, కుటుంబానికి అండగా ఉంటామని హామీ

👉పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో వైఎస్‌ జగన్‌ మమేకమయ్యారు. ఈ సందర్భంగా అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు.

👉వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు. పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్‌ జగన్‌ భరోసానిచ్చారు.

 

👉 వైఎస్‌ జగన్‌ పులివెందులలోకి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. వైఎస్‌ జగన్‌ రాకతో ప్రజలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. 

👉 క్యాంపు కార్యాలయంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పులివెందుల నియోజకవర్గం ముఖ్య నాయకులతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. 

👉 వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి వైఎస్సార్‌ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా వైఎస్‌ జగన్‌ పార్టీ నేతలను, కార్యకర్తలను క్యాంపు కార్యాలయంలో కలవనున్నారు. వారి నుంచి వినతులను స్వీకరించనున్నారు.

👉 ఆదివారం ఉదయం వైఎస్‌ జగన్‌ను ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి కలిశారు.

👉 వైఎస్సార్‌ జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా నేడు(ఆదివారం) లింగాల మండలం పెద్దకూడాలలో వైఎస్సార్‌సీపీ నేత కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌ పరామర్శించనున్నారు.

👉 ఇక, రేపు ఇడుపులపాయలో దివంగత వైఎస్సార్‌ జయంతి వేడుకులకు వైఎస్‌ జగన్‌ హాజరుకానున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement