సాక్షి, అమరావతి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ ‘క్లాప్’ కార్యక్రమంపైనా కూడా సీఎం సమీక్షించారు. క్లాప్ కార్యక్రమంపై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలందించారు. మున్సిపాలిటీ, నగరాల్లో రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆర్ అండ్ బి శాఖతో సమన్వయం చేసుకుని కార్యాచరణ రూపొందించాలని.. పట్టణాలు, నగరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వర్షాకాలం ముగియగానే రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం తెలిపారు.
కన్‌స్ట్రక్షన్, డిమాలిషన్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. విశాఖ, విజయవాడ, తిరుపతిల్లో ఇప్పటికే ప్లాంట్లు ఉన్నాయని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురంల్లో కూడా ఇలాంటి ప్రాజెక్టులు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే..
►గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సన్నద్ధం కావాలని సీఎం ఆదేశాలు
►దీనివల్ల ప్రతి 2వేల జనాభాకు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసు వస్తుందన్న సీఎం
►ప్రజలకు అత్యంత చేరువలో సేవలు లభిస్తాయి:
►దీంతోపాటు.. ఆ గ్రామ, వార్డు సచివాలయాల్లో పరిధిలో భూములపై తగిన పర్యవేక్షణ ఉంటుంది
►దీనివల్ల ఆక్రమణలు, అన్యాక్రాంతాలకు ఆస్కారం ఉండదన్న సీఎం
►అర్హులైన పేదలందరికీ కూడా 90 రోజుల్లో ఇంటి స్థలాలను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్న సీఎం
►పేద కుటుంబాలు ఇంటి స్థలం కోసం మధ్యవర్తులతో పాటు, ఇతరులమీదో, ఇతర మార్గాలమీద ఆధారపడాల్సిన అవసరంలేని పరిస్థితిని తీసుకొచ్చామన్న సీఎం
►అలాగే ఉల్లంఘనలు, ఆక్రమిత ప్రాంతాల్లో కనీస సదుపాయాలులేని పరిస్థితి ఉండకూడదనే భారీ ఎత్తున 30 లక్షలకుపైగా ఇళ్ల స్థలాలు మంజూరు చేశాం
►దీంతో పాటు, 15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించామన్న సీఎం
►దీనికోసం పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాం
►అర్హులైన వారు రాజమార్గంలో పట్టా తీసుకునే పరిస్థితిని మనం సృష్టించాం:
►ఇకపై అక్రమ ప్రాంతాల్లో, ఆక్రమిత ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకునే వారిని నెట్టివేసే పరిస్థితులను పూర్తిగా తీసివేశాం
►పేదవాడికి ఇంటి స్థలం లేదని మన దగ్గరకు వచ్చినప్పుడు అర్హుడైతే 90 రోజుల్లోగా వెంటనే ఇంటిపట్టాను మంజూరుచేసే కార్యక్రమం చేస్తున్నాం:
విశాఖపట్నంలో చేపట్టనున్న పలు అభివృద్ధి ప్రాజెక్టులపైనా సీఎం సమీక్ష
►బీచ్‌కారిడార్, మల్టీలెవర్ కార్‌పార్కింగ్, నేచురల్ హిస్టరీ పార్క్, మరియు మ్యూజియం, బీచ్ కారిడార్ ప్రాజెక్టులపై సీఎం సమీక్ష
►టిడ్కో ఇళ్ల నిర్మాణాలు, కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం సమీక్ష
►నిర్దేశించుకున్న షెడ్యూలు ప్రకారం టిడ్కోఇళ్లు పూర్తికావాలన్న సీఎం
►అదే సమయంలో మౌలిక సదుపాయాల కల్పనపైనా దృష్టిపెట్టాలన్న సీఎం
►మొదటివిడతలో భాగంగా చేపట్టిన 38 లొకేషన్లలో 85,888 ఇళ్లలో సుమారు 45వేలకుపైగా ఇళ్లు మూడు నెలల్లోగా, మిగిలిన ఇళ్లు డిసెంబర్‌లోగా అప్పగిస్తామన్న అధికారులు
►లబ్ధిదారులకు ఇళ్లుఅప్పగించేటప్పుడు పూర్తిగా అన్నిరకాల వసతులతో ఇవ్వాలన్న సీఎం
► మౌలికసదుపాయాలు విషయంలో రాజీ పడొద్దన్న సీఎం
వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్ నిర్మాణంపైనా సీఎం సమీక్ష
►విజయవాడ, గుంటూరు, నెల్లూరుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తిచేయడానికి కార్యాచరణ సిద్ధంచేయాలని సీఎం ఆదేశం
►గత ప్రభుత్వం హయాంలో ఈ ప్రాజెక్టులను అసంపూర్తిగా విడిచిపెట్టారని సమావేశంలో ప్రస్తావన
►మూడు ప్రాంతాల్లో ట్రీట్‌మెంట్‌ప్లాంట్లకు పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు సిఫార్సులు
►లేకపోతే నదులు కలుషితం అవుతున్నాయని ఆందోళన
►ఈ నేపథ్యంలో మూడు చోట్ల వెంటనే ట్రీట్ మెంట్‌ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
►మంగళగిరి – తాడేపల్లి, మాచర్ల, కర్నూలులో ట్రీట్‌మెంట్‌ప్లాంట్ల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీఎం
పులివెందులలో పైలట్ ప్రాజెక్టుగా మహిళా మార్ట్
►మహిళా మార్ట్ నిర్వహణపై సీఎం అభినందనలు
►మహిళా సంఘాల సహాయంతో మార్ట్ నిర్వహణ బాగుందన్న సీఎం
►మార్ట్‌లో మహిళలను భాగస్వాములుగా చేయడం బాగుందన్న సీఎం
►తక్కువ ధరలకూ వారికి అందుబాటులో సరుకులు అందడం బాగుందన్న సీఎం
►ఒక్కో మహిళ నుంచి రూ.150ల చొప్పున 8వేలమంది మహిళా సంఘాల సభ్యులనుంచి సేకరించి, ఆ డబ్బుతో మార్టు పెట్టామన్న అధికారులు
►మెప్మా దీనిపై పర్యేవేక్షణ చేస్తుందన్న అధికారులు
►మెప్మా ఉత్పత్తులు కూడా ఈ మార్ట్‌లో ఉంచామన్న అధికారులు
►మార్ట్ నిర్వహణ పనితీరుపై నిశిత పరిశీలన చేసి.. మిగతాచోట్ల కూడా అలాంటి ప్రయత్నాలు చేయాలన్న సీఎం
ఈ సమీక్షా సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, ఏఎంఆర్‌డీఏ కమిషనర్ పి లక్ష్మీ నరసింహం, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి వి రామ మనోహరరావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఎం ఎం నాయక్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment