జోగి రమేష్‌ అరెస్టు ముమ్మాటికీ అక్రమమే | YS Jagan React On Jogi Ramesh Arrest: Andhra pradesh | Sakshi
Sakshi News home page

జోగి రమేష్‌ అరెస్టు ముమ్మాటికీ అక్రమమే

Nov 3 2025 5:16 AM | Updated on Nov 3 2025 10:47 AM

YS Jagan React On Jogi Ramesh Arrest: Andhra pradesh

నకిలీ మద్యం తయారీ, సరఫరా, అమ్మేది అంతా మీ వారే బురదజల్లేది.. అరెస్టు చేసేది మాత్రం మా వాళ్లనా?

సీఎం చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ అంటూ వైఎస్‌ జగన్‌ మండిపాటు 

నకిలీ మద్యం అంశంపై సీబీఐ విచారణ చేయించాలని హైకోర్టులో పిటిషన్‌ వేసిన మరుసటి రోజే అరెస్టు చేస్తారా? 

ఈ వ్యవహారంలో మీ ప్రమేయం, 

మీ మనుషుల ప్రమేయం లేకపోతే సీబీఐ విచారణకు భయమెందుకు?  

మీ మాఫియా వ్యవహారాలపై మీ ‘సిట్‌’తో మీరే విచారణ చేయించడం హాస్యాస్పదం కాదా? 

కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటలో మీ వైఫల్యం,మోంథా తుపాను వల్ల నష్టపోయిన రైతుల గోడును పక్కదోవ పట్టించడానికే ఈ అరెస్టు

సాక్షి, అమరావతి: మాజీ మంత్రి జోగి రమేష్‌ అక్రమ అరెస్టును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి.. దాని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ తమ పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్‌ను అన్యాయంగా అరెస్టు చేశారంటూ సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి రమేష్‌ అరెస్టు ముమ్మాటికీ అక్రమమేనని స్పష్టం చేశారు. బాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ హ్యాష్‌ ట్యాగ్‌తో ఆదివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..  

 ‘చంద్రబాబు గారూ.. మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్‌ను అన్యాయంగా అరెస్టు చేశారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు. జోగి రమేష్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.  

 గత 18 నెలలుగా ప్రభుత్వం మీది.. పాలన మీది. పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలోనిది. పట్టుబడ్డ వారిలో మీ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు.. మీతోనూ, మీ కొడుకుతోనూ, మీ మంత్రులతోనూ, మీ ఎమ్మెల్యేలతోనూ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారే.  

మీరు తయారు చేసిన మీ నకిలీ మద్యాన్ని అమ్మేది మీరు తీసుకు వచ్చిన మీ ప్రైవేటు లిక్కర్‌ షాపుల్లో.. మీ కార్యకర్తలు, నాయకులు నడిపే బెల్టు షాపులు, పరి్మట్‌ రూముల్లోనే. మరి తయారీ మీది, చేసిన వారు మీ వారు, అమ్మేదీ మీ వారే.. కానీ బురదజల్లేది, అక్రమ అరెస్టులు చేసేది మాత్రం మావాళ్లని.  

నిన్న కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు కారణమైన ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి, మోంథా తుపాను కారణంగా కుదేలైన రైతుల గోడును పక్కదోవ పట్టించడానికి ఈ అక్రమ అరెస్టుకు పాల్పడి, దుర్మార్గానికి ఒడిగట్టారు. 

జోగి అరెస్ట్ పై YS జగన్ ఫైర్

నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ జోగి రమేష్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసిన మరుసటి రోజే అరెస్టుకు దిగారంటే మీరు ఎంతగా భయపడుతున్నారో అర్థం అవుతోంది చంద్రబాబు గారూ.. నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయం, మీ మనుషుల ప్రమేయం లేకపోతే సీబీఐ చేత విచారణకు భయమెందుకు చంద్రబాబు గారూ? ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీ జేబులో ఉన్న సిట్‌ మీరు ఏం చెబితే అది చేస్తుంది. మీరు సిట్‌ అంటే సిట్‌.. స్టాండ్‌ అంటే స్టాండ్‌. మీ మాఫియా వ్యవహారాల మీద మీరే విచారణ చేయించడం హాస్యాస్పదం కాదా? ఇలాంటి రాక్షస పాలనలో మీ నుంచి ఏమి ఆశించగలం!?.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement