సీఎం వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయం  | YSR Aarogya Aasara Scheme Helping Amount Hiked | Sakshi
Sakshi News home page

సీఎం వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయం 

Published Fri, Sep 18 2020 3:48 PM | Last Updated on Fri, Sep 18 2020 5:09 PM

YSR Aarogya Aasara Scheme Helping Amount Hiked - Sakshi

సాక్షి, తాడేపల్లి : ఆంధ్ర​ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద ప్రోత్సాహకం పెంచుతున్నట్లు ప్రకటించారు. సాధారణ ప్రసవానికి ప్రస్తుతం ఇస్తున్న 3వేల రూపాయల ప్రోత్సాహకాన్ని 5వేల రూపాయలకు, సిజేరిన్ ప్రసవానికి సంబంధించి ప్రోత్సాహకాన్ని 1000 నుంచి 3 వేల రూపాయలకు పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..  ఆస్పత్రి సేవలు అధ్వాన్నంగా ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టాలని, రెండు వారాల్లో పరిస్థితి మెరుగు పడాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల్లో అన్ని నిబంధనలు పాటించాలని, 6 నెలల తర్వాత పరిస్థితులు మెరుగుపడకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాల్లో ఆరోగ్య శ్రీ కో ఆర్డినేషన్ బాధ్యతలు ఇక నుంచి జేసీలకి అప్పజెప్పాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

చదవండి : ‘శాశ్వత ఉచిత విద్యుత్‌’లో మరో కీలక అడుగు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement