
తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో మహిళలకు చేయూత చెక్కులను పంపిణీ చేస్తున్న ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
సాక్షి, నెట్‌వర్క్: దేశ చరిత్రలోనే మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి వారి కుటుంబాల్లో వెలుగునింపేందుకు నిత్యం సంక్షేమ పథకాల ద్వారా వారి అభివృద్ధిని ఆకాంక్షిస్తున్న గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు అన్నారు.
వైఎస్సార్ చేయూత కార్యక్రమానికి సంబంధించి మహిళలకు చెక్కులను రాష్ట్రవ్యాప్తంగా శనివారం కూడా పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కి ధన్యవాదాలు తెలుపుతూ క్షీరాభిషేకాలు నిర్వహించారు. తమకు ఆసరాగా నిలుస్తోన్న సీఎం జగన్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మహిళలు చెప్పారు.