
ఏపీ విభజన అడ్డగోలుగా చేశారని.. కాబట్టే కాంగ్రెస్‌ను ప్రజలు సమాధి చేశారని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు.
సాక్షి, ఢిల్లీ: ఏపీ విభజన అడ్డగోలుగా చేశారని.. కాబట్టే కాంగ్రెస్‌ను ప్రజలు సమాధి చేశారని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో సాక్షితో మాట్లాడుతూ, అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత బీజేపీపైనే ఉందన్నారు. విభజన చట్టంలో హామీలన్నీ తక్షణమే అమలు చేయాలన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం హామీలు నిలబెట్టుకోవాలన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తాము మొదటి నుంచి చెబుతున్న విషయాన్ని ప్రధాని ఈరోజు చెప్పారన్నారు. టీడీపీ రాష్ట్రాభివృద్ధి వదిలేసి పనికిమాలిన ఫిర్యాదులు చేస్తోందని.. రాష్ట్రాభివృద్ధిని టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఎంపీ మిథున్‌రెడ్డి నిప్పులు చెరిగారు.