వేధింపులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక వ్యవస్థ
సెంట్రల్ ఆఫీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులను ఎదుర్కొంటున్న కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొండంత అండగా నిలుస్తోంది. వారికి అండగా ఉండేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలు, యాక్టివిస్ట్‌లపై కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులను దీటుగా ఎదుర్కొని, అన్ని విధాలా వారికి అందుబాటులో ఉండేందుకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ‘సెంట్రల్ ఆఫీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్’ను ఏర్పాటు చేసినట్లు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులకు, ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ సమన్వయకర్తలకు సమాచారం పంపింది. ఈ సెంటర్‌లో ముగ్గురు సభ్యులు ఉంటారు. పార్టీ క్యాడర్‌పై అక్రమ కేసులకు సంబంధించి ఎవరికి ఎలాంటి సహాయం అవసరమైనా వెంటనే వీరిని సంప్రదిస్తే తగిన చర్యలు తీసుకుంటారని పార్టీ తెలిపింది.
అండగా ఉన్నారనే భరోసా కల్పించాలి
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు వారి నియోజకవర్గాల్లో యాక్టివ్‌గా ఉన్న పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు, యాక్టివిస్ట్‌లను గుర్తించి, అండగా ఉన్నారనే భరోసా వారికి కల్పించాలని పార్టీ తెలిపింది. కేసుల విషయమై కార్యకర్తలు ఫోన్ చేయగానే వారి ప్రతినిధి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి మాట్లాడాలని, లీగల్‌గా కూడా స్పందించాలని పార్టీ కేంద్ర కార్యాలయం సూచించింది.
సెంట్రల్ ఆఫీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సభ్యుల వివరాలు
జె. సుదర్శన్ రెడ్డి , సీనియర్ అడ్వొకేట్
ఫోన్ నం: 9440284455
కొమ్మూరి కనకారావు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్
మాజీ ఛైర్మన్ – ఫోన్ నం: 9963425526
దొడ్డా అంజిరెడ్డి , రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ – ఫోన్ నం: 9912205535
Comments
Please login to add a commentAdd a comment