‘కూటమి అసమర్థత వల్లే ఏపీలో ఇంధన కొరత’ | Yv Subba Reddy Comments On Fuel Shortage In AP | Sakshi
Sakshi News home page

‘కూటమి అసమర్థత వల్లే ఏపీలో ఇంధన కొరత’

Apr 29 2026 2:55 PM | Updated on Apr 29 2026 7:12 PM

Yv Subba Reddy Comments On Fuel Shortage In AP

సాక్షి, ఒంగోలు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. త్రోవగుంట ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద  జీపీఎస్ ఫౌండేషన్ పేరుతో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు రాయపాటి అంకయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొక్కజొన్న రైతులు పక్క రాష్ట్రం తెలంగాణాకు పోయి అమ్ముకోవాల్సిన దుస్థితి ఈ రాష్టంలో ఏర్పడిందని మండిపడ్డారు. అమరావతిలో వేల కోట్లు దోచుకోవటానికి తప్ప అమరావతిపై ప్రేమ లేదన్న వైవీ సుబ్బారెడ్డి.. కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన వలన రాష్ట్రంలో ఇంధన కొరత  ఏర్పడిందని.. ఆంధ్రప్రదేశ్‌లో తప్ప ఏ రాష్ట్రంలో ఇంధన సమస్య లేదన్నారు. రాష్ట్రంలో ఇంధన కొరత వల్ల ఆక్వా రంగం పూర్తిగా దెబ్బతిందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

అమరావతికి డీజిల్ తరలింపు.. ఏపీలో మాత్రమే ఇంధన కొరత

Advertisement
 
Advertisement
Advertisement