ఐదుగురు డీటీల బదిలీ
రాయచోటి: జిల్లాలో ఐదుగురు డిప్యూటీ తహసీల్దార్ల(డీటీ)ను బదీలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఉత్తర్వులు ఇచ్చారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుంచి విడుదలైన ఉత్తర్వులో బదిలీ అధికారుల పేర్లను పేర్కొన్నారు. పీలేరు డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచే స్తున్న జి రెడ్డప్ప ర్డెని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రొటోకాల్ సెక్షన్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా, మదనపల్లె డీటీగా పనిచేస్తున్న జి అస్లాంను టి సుండుపల్లి డీటీగా, నిమ్మనపల్లి డీటీగా పనిచేస్తున్న ఆర్‌ఎం బాబ్జీ మదనపల్లి డీటీగా, సుంపపల్లి డీటీగా పనిచేస్తున్న బి రెడ్డన్న లక్కిరెడ్డిపల్లి టీడీగా, పెనగలూరు డీటీగా పనిచేస్తున్న ఎం జ్యోతి నందలూరు డీటీగా బదిలీ చేస్తున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొన్నారు.
మార్చి 8న లోక్ అదాలత్
పీలేరురూరల్: జాతీయ లోక్ అదాలత్ మార్చి 8న జరుగనుంది. దీనిని విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం.ఎస్. భారతి అన్నారు. శుక్రవారం స్థానిక ఏడీజే కోర్టులో న్యాయవాదులు, పోలీసులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ కక్షిదారులు ఇరు వర్గాలను ఒప్పించి ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేయాలన్నారు. అనంతరం స్థానిక గిరిజన గురుకుల బాలుర పాఠశాలను సందర్శించి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు.స్థానిక సబ్‌జైల్‌ను సందర్శించి ఖైదీలకు ఉన్న సౌకర్యాల గురించి ఆరా తీశారు.11వ అదనపు జడ్జి ఎ. మహేష్, సీనియర్ సివిల్ కె. రవి, ఏపీపీ శారద, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, సెక్రటరీ చంద్రశేఖర్, సీఐ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
మార్చిలోపు వంద రోజుల పనులు పూర్తి చేసుకోవాలి
సిద్దవటం: ఉపాధి హామీ పథకం కూలీలు మార్చి లోపు వంద రోజుల కూలి పనులను పూర్తి చేసుకోవాలని డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి తెలిపారు. సిద్దవటం మండలం లోని సంటిగారిపల్లె , మాచుపల్లె గ్రామాల్లో డ్వామా పీడీ శుక్రవారం రెండు మినీ గోకులాలను, మూలపల్లె, టక్కోలు గ్రామాల్లో ఉపాధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు పూర్తి చేసుకున్న గోకులాల షెడ్లకు నిధులు మంజూరు చేయాలని కోరగా త్వరలో ప్రభుత్వం నుంచి ఖాతాల్లోకి నిధులు జమ అవుతాయని తెలిపారు. టక్కోలులో ఉపాధి పనులు చేస్తున్న పని ప్రదేశానికి వెళ్లి కూలీలతో సమావేశం నిర్వహించారు. వారితో మాట్లాడారు. పనిముట్లు, గడార్‌లు మొద్దు బారాయని కొత్తవి ఇవ్వాలని, పని ప్రదేశంలో వృద్ధులు, మహిళలకు షెఢ్ల సదుపాయం కల్పించాలని కూలీలు కోరగా ప్రభుత్వానికి నివేదిస్తామని పీడీ వారికి తెలియజేశారు. ఏపీడీ సో మశేఖర్‌రెడ్డి, ఏపీఓ నరసింహులు పాల్గొన్నారు.
ఫైలేరియా వ్యాప్తి
చెందకుండా అవగాహన
సిద్దవటం: ఫైలేరియా(బోదకాలు) వ్యాధి వ్యాప్తి చెందకుండా రోగులకు అవగాహన కల్పిస్తున్నామని జిల్లా మలేరియా అధికారిణి మనోరమ తెలిపారు. సిద్దవటం మండం లోని మాధవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఒంటిమిట్ట, మాధవరం, అట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసినట్లు చెప్పారు. సిద్దవటం సబ్ యూనిట్ పరిద్ధిలో 38 మందికి ఈ వ్యాధి సోకగా అందులో ఒంటిమిట్టలో 25 మందికి, మాధవరం–1లో 8మందికి , అట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ముగ్గురు ఫైలేరియా వ్యాధితో బాధపడుతున్నారన్నారు. వ్యాధితో బాధ పడుతున్న 38 మందికి ఫైలేరియా ఎంఎన్‌డీ కిట్స్‌ను పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మలేరియా సబ్‌యూనిట్ అధికారి సుబ్బరాయుడు, మాధవరం, ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు డాక్టర్ శివకుమార్, డాక్టర్ హేమలత తదితరులు పాల్గొన్నారు.
ఐదుగురు డీటీల బదిలీ
ఐదుగురు డీటీల బదిలీ
Comments
Please login to add a commentAdd a comment