●ప్రేమ పేరుతో దాడులు చేయడం ఆటవికం
మదనపల్లె: ప్రేమ పేరుతో దాడులు చెయ్యడం ఆటవికమని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు అన్నారు. యాసిడ్ దాడికి పాల్పడిన గ ణేష్‌ను కఠినంగా శిక్షించాలని శుక్రవారం ప్రజా సంఘాలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ గుర్రంకొండ మండలం, ప్యారంపల్లి యువతిపై ప్రేమోన్మాది దాడిని ఖండిస్తూ, సైకో గణేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిగ్రీ చదువుకుని స్వయం ఉపాధి పొందుతున్న యువతి ప్రేమించలేదనే ఉన్మాదంతో ప్రేమికుల దినోత్సవం రోజున కత్తితో పొడిచి, యాసిడ్ పోసి దాడి చేయడం ప్రతి ఒక్కరూ తలదించుకునే దుర్ఘటన అన్నారు. బాధిత యువతి కుటుంబానికి 25 లక్షల పరిహారం చెల్లించాలని, భాధితురాలికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కన్వీనర్ యం.భాగ్యమ్మ మాట్లాడుతూ మహిళలు, చిన్నపిల్లలపై దాడులు, అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులు అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment