‘భరోసా’తో అవగాహన కార్యక్రమాలు
జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు
మదనపల్లె: మహిళలు, యువతులు, చిన్నారులపై వేధింపులు, లైంగిక దాడులను అరికట్టేందుకు జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో భరోసా పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. ప్రత్యేక ప్రణాళికతో ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు, గ్రామాల్లో విస్తృతంగా ఈ కార్య క్రమాలు ఏర్పాటుచేస్తామన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులకు ఇందులో భాగస్వామ్యం కల్పించి, పిల్లల ప్రవర్తన, స్నేహాలు, ఇతర అంశాలపై దృష్టి పెట్టి బాధ్యతతో పర్యవేక్షణ జరిపేలా చూస్తామన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామన్నారు. సంక్షేమ హాస్టళ్లు, కాలేజీల్లో డ్రాప్‌బాక్స్‌లు ఏర్పాటు చేయనున్నామని, గోప్యత కావాలనుకున్న బాధితులు అందులో తమ సమస్యను వేయడం ద్వారా న్యాయం పొందవచ్చన్నారు. జిల్లాలో యాసిడ్ దాడి ఘటన జరగడం దురదృష్టకరమని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా యువ కులు సైకో ప్రవర్తన, నేర మనస్తత్వం కలిగి ఉంటే, వారి వివరాలను పోలీసులకు తెలిపితే, వారిపై ప్రత్యే క నిఘా ఉంచి నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలపై ఎలాంటి దాడులు చేసినా ఉపేక్షించేది లేదన్నారు. జిల్లాలో పోలీస్ వాట్సప్ ఛానల్‌ను ప్రారంభించామని, ప్రజాజీవనానికి సంబంధించి అవగాహన, ఇతర అంశాలను అందులో తెలపడం చేస్తామని, ప్రతి ఒక్కరూ అన్నమయ్య పోలీసు వాట్సప్ ఛానల్ ఫాలో కావడం ద్వారా సమాచారం తెలుసుకోవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment