మన మార్పు.. వారికి నేర్పు!
మదనపల్లె సిటీ: పబ్లిక్ పరీక్షలు సమయం దగ్గరపడుతోంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులపై ఒత్తిడి ఉంటుంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల దైనందిక జీవితంలో మార్గదర్శకులుగా మారడం అవసరం. వారి చదువుకు అనువైన వాతావరణం కల్పించాలి. జిల్లాలో మరో నెల రోజుల్లో పదోతరగతి, 15 రోజుల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల వేళ తల్లిదండ్రులు తమ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఆరోగ్యంపై శ్రద్ధ
జంక్‌పుడ్, నూనె పదార్థాలు, మసాలా ఆహారం తినకుండా నిలవరించాలి. ఇంట్లోనే షోషకాలు అందే ఆహారం సమకూర్చాలి. పెద్దలు వీటిని ఆహారంలో తీసుకోకుంటే పిల్లలకు అలవాటు అవుతుంది.
సెల్‌ఫోన్‌కో నియమం: పిల్లలు చదువుకునే సమయంలో పెద్దలు సెల్‌ఫోన్ చూస్తూ లేదా మాట్లాడుతూ కాలక్షేపం చేస్తుంటారు. దీంతో వారి ఏకాగ్రత సెల్‌ఫోన్‌పై మళ్లే అవకాశం ఉంటుంది. అవసరం మేరకే వారి ముందు ఫోన్ ఉపయోగించాలి.
ఒత్తిడికి దూరం..
చాలా సమయం వృథా చేస్తున్నావ్ అని పిల్లలను దబాయించకూడదు. ఇది మరింత ఒత్తిడికి గురయ్యేలా చేస్తుంది. ఒక్కో సారి తల్లిదండ్రులు వారి పని ఒత్తిడిని ఇంట్లో ప్రదర్శిస్తుంటారు. ఇది పిల్లల చదువుపై ప్రభావం చూపిస్తుంది.
అనువైన వాతావరణం
పిల్లలను చదవమని చెప్పి ఇంట్లో టీవీల్లో పెద్ద శబ్దాలు పెట్టడం, బయట వ్యక్తులతో పిచ్చాపాటి చర్చలు పెట్టడం వంటివి మానుకోవాలి. ప్రశాంత వాతావరణం కల్పిస్తే పుస్తకాలపై దృష్టి సారిస్తారు.
మత్తుకు దూరం: పరీక్షల సమయంలో మత్తుకు దూరంగా ఉండటంతో పాటు పిల్లలోనూ మత్తు, సిగరెట్, గుట్కా వంటివేమైనా అలవాటుందా గుర్తించి వాటి బారి నుంచి తప్పించడానికి ప్రయత్నించాలి.
పరీక్షల వేళ
తల్లిదండ్రులదే కీలకపాత్ర
Comments
Please login to add a commentAdd a comment