ఉపాధి అవినీతిపై చర్యలు తీసుకోవాలి
రాయచోటి : అన్నమయ్య జిల్లాలో ఉపాధి పనుల కేటాయింపులను, కూలీల వేతనాల పంపిణీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని జిల్లాలోని ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం వీరబల్లి ఎంపీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో కలిసి జిల్లాలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు రాయచోటిలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చామకూరి శ్రీధర్‌ను కలిశారు. ఉపాధిహామి పనులను కాంట్రాక్టర్లకు ఇవ్వకూడదన్న హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని విన్నవించారు. స్థానిక టీడీపీ నాయకులు యంత్రాలతో పనులు చేయిస్తూ, ప్రైవేటు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి నిబంధనలకు విరుద్ధంగా నిధులను డ్రా చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామసభ ఆమోదించిన పనులను మాత్రమే చేయాలని తెలిపారు. ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించామన్నారు. ఇలా చేయడం ఉపాధిహామి చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని, చట్ట విరుద్ధమని, అలా ప్రైవేటు కాంట్రాక్టర్లకు కేటాయించిన పనులను వెంటనే రద్దు చేయాలని తీర్పు ఇచ్చిన ఆదేశాలను కలెక్టర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం నాయకులు ఎం.రామస్వామి రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కోరిన ఎంపీపీలు, సర్పంచ్‌లు
Comments
Please login to add a commentAdd a comment