24న ధర్నాను జయప్రదం చేయండి
రాయచోటి అర్బన్ : వ్యవసాయ కార్మికులు, కూలీల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 24వ తేదీన విజయవాడ వద్దగల తాడేపల్లె గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కార్యాల యం ఎదుట జరుప తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయూ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి తోపు క్రిష్ణప్ప కోరారు. ధర్నాకు సంబంధించిన కరపత్రాలను సోమవారం ఆయన సంఘం నాయకులతో కలసి సీపీఐ జిల్లా కార్యాలయంలో విడుదల చేశారు.
మినిట్స్ కాపీలో ఇచ్చిన
జీఓలను అమలు చేయాలి
రాయచోటి అర్బన్ : సమ్మె సందర్భంగా యిచ్చిన మినిట్స్ కాపీలోని జీఓలను వెంటనే అమలు చేయాలని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాయచోటి ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి ఎస్.భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు.సోమవారం రాయచోటి ప్రాజెక్టు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రాజెక్టు పరిధిలో పలువురు వర్కర్లు, హెల్పర్లకు పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలన్నారు. దిగువరాజువారిపల్లె కేంద్రానికి 2 ఏళ్లుగా హెల్పర్ విధులకు హాజరు కాకపోయినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. యూనియన్ నాయకులు బంగారుపాప, అరుణ, విజయ, షబీనా, సుమలత, సురేఖ, పద్మజ, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment