ఫైనాన్స్ మోసం రూ.70 లక్షలు?
– లబోదిబోమంటున్న ఖాతాదారులు
బి.కొత్తకోట : పట్టణంలోని ఓ ఫైనాన్స్ కంపెనీ బ్రాంచ్‌లో బంగారం తాకట్టుపై రుణాల మంజూరు వ్యవహరంలో సిబ్భంది చేతివాటం ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ రుణాలపై ఇటీవల ఆరోపణలు రావడంతో ఆ కంపెనీకి చెందిన ఆడిటర్లు, విజిలెన్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఇందులో రూ.40 లక్షల మేర తాకట్టు రుణాలపై మళ్లీ అధిక మొత్తాల్లో రుణాలు తీసుకుని కొందరు సొంతానికి వాడుకున్నట్లు తేలింది. మరో రూ.30 లక్షల కంపెనీ ఉత్పత్తులకు సంబంధించిన సొమ్ముకు లెక్కలు తేలినట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహరంలో ముగ్గురు సిబ్బంది ఉన్నటుం్ల నిర్ధారించిన బృందాలు వారిపై ఎలాంటి చర్యలు చేపట్టాలనేదానిపై కంపెనీకి నివేదించినట్లు తెలిసింది. ఆ ముగ్గురిలో ఒకరిద్దరు అందుబాటులో లేరన్న ప్రచారం జరుగుతోంది. ఈ మోసం వెలుగులోకి రావడంతో ఖాతాదారులు లబోదిబో మంటున్నారు. తమకు జరిగిన మోసం, అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారినుంచి స్వాహా చేసిన సొమ్మును రాబట్టాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు.
జేసీబీతో రహదారిని తవ్వేశారు
లక్కిరెడ్డిపల్లె : ఏళ్ల తరబడి ఉన్న రహదారిని కొందరు వ్యక్తులు తవ్వేశారు. మండలంలోని కోనంపేట నుంచి యర్రప్పగారిపల్లెకు వెళ్లేందుకు రహదారి ఉంది. ఇటీవల రైతు కొనసాని వెంకట సుబ్బారెడ్డి ఆ దారి తన పట్టా భూమి అంటూ తవ్వేశారు. అదే రోడ్డు మార్గంలో ఇంకో రైతు నాగిరెడ్డి తన పొలంలోకి వస్తుందంటూ జేసీబీతో తవ్వేశారు. దీంతో ఆదారిన ఉండే గ్రామాలకు జనం, విద్యార్థులు కూడా నడచి వెళ్లాల్సి వచ్చింది. ఆటోలు, స్కూల్ బస్సులు, ట్రాక్టర్లు వెళ్లకుండా తవ్వేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ జోక్యం చేసుకుని రహదారిని పురుద్ధరించాలని స్థానికులు కోరారు.
ఆటోడ్రైవర్ నిజాయితీ
రాయచోటి టౌన్ : రాయచోటి పట్టణంలో ఓ ఆటో డ్రైవర్ నిజాయితీ చాటాడు. రాయచోటి అర్బన్ ఎస్‌ఐ అబ్దుల్ జాహీర్ కథనం మేరకు..మదనపల్లెకు చెందిన మహబూబ్‌బాషా, భార్యతో కలిసి రాయచోటికి వచ్చాడు. పనులు పూర్తిచేసుకొని మార్కెట్ వద్ద ఆటో ఎక్కి ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చాడు. ఆటోలో తన భూమికి సంబంధించిన పత్రాలను(ల్యాండ్ డాక్‌మెంట్ పేపర్లు) మరచిపోయాడు. తరువాత ఆటో డ్రైవర్ అక్కడి నుంచి తిరిగి స్టాండ్‌లోకి వెళ్లాడు. వెళ్లిన తరువాత డ్రైవర్ హరిబాబు తన ఆటోలో ఉన్న బ్యాగ్‌ను పరిశీలించి వెంటనే అర్బన్ పోలీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అందులో ఆధారాల ప్రకారం మహబూబ్ బాషాకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వారికి పత్రాలు ఉన్న బ్యాగ్ అందజేశారు. దీంతో ఆటో డ్రైవర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
ట్రాలీ కింద పడి మహిళ మృతి
రాజుపాళెం : మండలంలోని పర్లపాడు గ్రామానికి చెందిన దారాల ఆరోగ్యమ్మ (52) ట్రాక్టర్ ట్రాలీ కింద పడి మంగళవారం మృతి చెందినట్లు రాజుపాళెం ఎస్‌ఐ కత్తి వెంకటరమణ తెలిపారు. ఆ గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో శనగ పంట కోతకు వెళ్లిన ఆరోగ్యమ్మ పొలం వద్దనే ఉన్న ట్రాక్టర్ ట్రాలీ వద్ద సేద తీరుతోంది. డ్రైవర్ నిర్లక్ష్యంగా ట్రాక్టర్ తోలడంతో ఈ సంఘటన చోటు చేసుకుందన్నారు. ట్రాలీ కింద పడిన ఆరోగ్యమ్మకు తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు అక్కడి వైద్యులు చెప్పారు. మృతురాలి కుమారుడు దారాల చెన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ పై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ చెప్పారు. శవాన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఇద్దరు ట్రాన్స్‌ఫార్మర్ దొంగల అరెస్టు
– 180 కిలోల కాపర్ తీగలు, పల్సర్ బైక్ స్వాధీనం
చక్రాయపేట : ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి కాపర్ వైరు చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. గాలివీడు క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా.. పోలీసులను చూసి నిందితులు పారి పోయేందుకు ప్రయత్నించారన్నారు. పోలీసులు పట్టుకుని విచారించినట్లు తెలిపారు. వైస్సార్ జిల్లా వ్యాప్తంగా 12 పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోని 27 ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి కాపర్ వైరు దొంగిలించినట్లు వారు అంగీకరించారని చెప్పారు. వారి అరెస్టు అనంతరం కడప విమానాశ్రయం వద్ద కంపచెట్లలో దాచిన 180 కిలోల కాపర్ వైరు, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పాడు. నిందితులు చెన్నూరు మండలం శాటిలైట్ సిటీ సమీపాన ఉన్న రుద్రభారత్‌పేటకు చెందిన ఈభూది మల్లికార్జున, శంకల శంకర్ అని చెప్పారు. దొంగలను పట్టుకున్న సీఐ ఉలసయ్య, ఎస్సై కృష్ణయ్య, సిబ్బందిని డీఎస్పీ మురళి అభినందించారు.
వీధి కుక్కల దాడిలో
మేకల మృతి
వేంపల్లె : పట్టణంలోని కడప రోడ్డులో నివాసముంటున్న సుధాకర్‌కు చెందిన మేకలపై మంగళవారం తెల్లవారుజామున వీధి కుక్కలు దాడి చేశాయి. నాలుగు మేకలు మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు. కుటుంబ పోషణకు మేక పిల్లలను పెంచుకుంటున్నానని, కుక్కల దాడితో రూ.50 వేల నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రభుత్వం పరిహారం అందించేలా చూడాలని కోరారు.
ఫైనాన్స్ మోసం రూ.70 లక్షలు?
Comments
Please login to add a commentAdd a comment