కడప రూరల్: కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు, వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య తెలిపారు. ఈ జాబితాను సీఎఫ్‌డబ్ల్యూ.ఏపీ.జీఓవీ.ఐఎన్ వెబ్‌సైట్‌లో చూడవచ్చని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 22వ తేదీలోపు తమ అభ్యర్థనలను తెలపాలని సూచించారు. 28వ తేదీన ఫైనల్ మెరిట్ జాబితాను ప్రకటిస్తామని వివరించారు.
2600 మెట్రిక్ టన్నుల యూరియా రాక
కడప అగ్రికల్చర్: ఉమ్మడి వైఎస్సార్ జిల్లాకు బుధవారం 2600 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు వెల్లడించారు. వైఎస్సార్‌జిల్లాకు 1300 మెట్రిక్ టన్నుల యూరియాను ప్రైవేటు డీలర్లకు కేటాయించగా మరో 1000 మెట్రిక్ టన్నుల యూరియాను మార్క్‌ఫెడ్‌కు కేటాయించామన్నారు. అన్నమయ్య జిల్లా మార్క్‌ఫెడ్‌కు 300 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment