హార్సిలీహిల్స్ విద్యార్థుల గోల్డెన్ జూబ్లీ వేడుక
బి.కొత్తకోట: బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌పై ఒకప్పుడు ఉన్న స్కూలులో చదువుకున్న విద్యార్థులు 50 ఏళ్ల తర్వాత ఇదే హార్సిలీహిల్స్‌పై ఆదివారం కలుసుకుని గోల్డెన్ జూబ్లీ వేడుకను ఉత్సాహాంగా జరుపుకున్నారు. కొండపై గతంలో హార్సిలీహిల్స్ హైస్కూల్ ఉండేది. 1975లో పదో తర గతి కలిసి చదువుకున్న అప్పటి విద్యార్థులు..ప్రస్తుతం వివిధ రంగాల్లో, రాజకీయాల్లో ఉన్న వీరంతా సమావేశం నిర్వహించుకున్నారు. అప్పటి గురువులను స్మరించుకుని మృతిచెందిన ఉపాధ్యాయుల చిత్రపటా లకు నివాళులర్పించారు. ఆట పాటలతో ఆనందంగా గడిపారు. తాము చట్టసభల్లో పని చేశామని, ఉన్నతాధికారులమన్న భావన లేకుండా ఒక్కటిగా కలిసి కొండపై సందడి చేశారు. కాలినడక ప్రకృతి అందాలను తిలకిస్తూ అప్పట్లో ఇక్కడ ఇలా ఉండేది..ఇప్పుడు ఇలా ఉంది అంటూ స్మృతులను నెమరేసుకున్నారు. సరదాగా క్రికెట్, ఇతరా క్రీడలు ఆడారు. చివర్లో పాత మిత్రులు కలిసి గ్రూప్‌ఫొటో దిగారు. ఈ పూర్వ విద్యార్థుల్లో శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి, విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి, వాణిజ్య పన్నులశాఖ జాయింట్ కమిషనర్ ఓంకార్, అనీషారెడ్డి, శ్రీనాథరెడ్డి, రాటకొండ తిలక్ తదితరులు పాల్గొన్నారు.
50 ఏళ్ల తర్వాత కలయిక
వీరిలో మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు
Comments
Please login to add a commentAdd a comment