యువకుడిపై దాడి
పులివెందుల రూరల్ : పులివెందుల మండల పరిధిలోని నల్లగొండువారిపల్లె గ్రామ సమీపంలోని తోటల వద్ద మట్టిని తోల కూడదని చెప్పినందుకు మణికంఠ అనే యువకునిపై దాడి చేసి గాయ పరిచారు. బాధితుని ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మట్టిని అక్రమంగా తరలిస్తుంటే తరలించ వద్దని చెప్పినందుకు సాదావలీ, అక్బరమ్మలు అరటి కాయలు కోసే కొడవలితో దాడి చేశారు. దీంతో వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం పులివెందుల ఆసుపత్రికి తరలించారు.
నలుగురు మట్కా
నిర్వాహకుల అరెస్టు
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని దస్తగిరి పేటలో మట్కా నిర్వహిస్తున్న నలుగురిని టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. మట్కా నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో టూటౌన్ సీఐ యుగంధర్ సిబ్బందితో కలిసి ఆదివారం సాయంత్రం దాడులు నిర్వహించారు. దాడిలో దస్తగిరిపేటకు చెందిన షేక్ నూరుద్దీన్‌తోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.70,250 నగదు, మట్కా పట్టీలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
ఆటోలో పోగొట్టుకున్న ల్యాప్‌టాప్ అప్పగింత
కడప అర్బన్ : ఆటోలో ల్యాప్‌టాప్ ఇతర విలువైన వస్తువులను మరిచిపోయి దిగిన బాధితునికి పోలీసులు తిరిగి వాటిని అందజేశారు. వివరాలిలా.. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మురళి తన సొంత పనిమీద కడపకు వచ్చాడు. అప్సర సర్కిల్ వద్ద ఆటో దిగే సమయంలో తన ల్యాప్‌టాప్ ఇతర విలువైన వస్తువులు ఉన్న బ్యాగ్‌ను ఆటోలో మరిచిపోయి దిగి వెళ్లిపోయాడు. తర్వాత ఆ విషయాన్ని గుర్తించి చిన్న చౌక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆటో వచ్చిన మార్గంలోని వివిధ చోట్ల ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌లను కానిస్టేబుళ్లు శ్రీనివాస్, ఖాదర్ లు పరిశీలించి ఆటోను గుర్తించాడు. బాధితుడు కోల్పోయిన బ్యాగు, ల్యాప్‌టాప్, వాచ్ ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుని బాధితుడికి అందించారు. పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపాడు. అధికారుల ఆదేశాలతో తక్షణం స్పందించిన కానిస్టేబుళ్లను చిన్నచౌకు పోలీస్ స్టేషన్ సీఐ ఓబులేసు, ఎస్‌ఐలు రాజరాజేశ్వర రెడ్డి, రవి కుమార్, సిబ్బంది ప్రశంసించారు.
యువకుడిపై దాడి
Comments
Please login to add a commentAdd a comment