వ్యక్తి దారుణ హత్య
సంబేపల్లె : సంబేపల్లె మండల పరిధిలోని నారాయణరెడ్డిపల్లె గ్రామం ముదినేని వడ్డిపల్లెకు చెందిన తిరుపతి వారాధి (65) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల మేరకు ముదినేని వడ్డిపల్లెకు చెందిన టి. వారాధి గ్రామంలో రోడ్డుకు సంబంధించి బ్రిడ్జి నిర్మాణపు పనులు చేసేవాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి బ్రిడ్జి నిర్మాణపు పనుల వద్దకు వెళ్లాడు. ఆదివారం తెల్లవారే సరికి అతను శవమై కనిపించాడు. సమాచారం తెలుసుకున్న రూరల్ సీఐ వరప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మృతుని భార్య రెడ్డమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసును పోలీసులు సవాల్‌గా తీసుకుని విచారణ ముమ్మరం చేశారు. హత్యకు గురైన తండ్రిని చూసి కొడుకు నాగేశ్వర ‘నేను కువైట్ నుంచి వచ్చింది నీ చావు చూసేందుకా నాన్నా’ అంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు.
హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
వారాధిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర క్రీడా శాఖా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పోలీస్ అధికారులకు సూచించారు. ఆదివారం మండల పరిధిలోని ముదినేనివాండ్లపల్లె సమీపంలో హత్యకు గురైన వారాధి మృతదేహాన్ని పరిశీలించారు.
వ్యక్తి దారుణ హత్య
Comments
Please login to add a commentAdd a comment