అత్తమామలపై అల్లుడి దాడి
మదనపల్లె : మద్యం మత్తులో అత్తమామలపై అల్లుడు దాడిచేసిన ఘటన ఆదివారం పీటీఎం మండలంలో జరిగింది. బూచుపల్లెకు చెందిన గంగాధర(50), లక్ష్మీనరసమ్మ(45) దంపతులు. వీరి కుమార్తె గాయత్రిని అదే గ్రామానికి చెందిన అమరప్ప కుమారుడు విజయ్ ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఉపాధి నిమిత్తం భార్యతో కలిసి బెంగళూరుకు వెళ్లి అక్కడే డ్రైవర్‌గా పనిచేసేవాడు. అయితే గత కొంతకాలంగా మద్యానికి బానిసై తరచూ భార్యను వేధింపులకు గురిచేస్తూ అదనపు కట్నం కోసం ఒత్తిడి చేసేవాడు. ఈ క్రమంలో శివరాత్రి పండుగ సందర్భంగా స్వగ్రామానికి భార్యతో కలిసి వచ్చి, ఆమెను పుట్టినింట్లో వదిలిపెట్టాడు. ఆదివారం మధ్యాహ్నం పూటుగా మద్యంసేవించి భార్య వద్దకు వచ్చి గొడవకు దిగాడు. ఆమైపె దాడిచేస్తుండగా, అత్త లక్ష్మీనరసమ్మ, మామ గంగాధర అడ్డుకునే ప్రయత్నం చేశారు. తీవ్ర ఆవేశానికి లోనైన విజయ్ వారిపై దాడిచేసి విచక్షణారహితంగా కొట్టాడు. దాడిలో గాయపడిన గంగాధర, లక్ష్మీనరసమ్మలను 108 వాహనంలో బి.కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఔట్‌పోస్ట్ పోలీస్ సిబ్బంది పీటీఎం స్టేషన్‌కు సమాచారం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment