మార్చి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. జనం చల్లని పా
● గతేడాది కంటే తక్కువ సాగు
● దిగుబడి కొనుగోలుపై వ్యాపారుల ఆసక్తి
● తొలి కోతలోనే అధిక ధరలు
● లాభాల బాటలో రైతులు
రైల్వేకోడూరు అర్బన్: గత కొన్నేళ్లుగా దోస పంట రైతులకు నష్టాలు మిగిల్చింది. తెగుళ్ల బెడదతో దిగుబడి సరిగా రాకపోవడం.. నాణ్యత కూడా లేకపోవడంతో ధరలు పలకలేదు. దీంతో ఈ ఏడాది దోస పంట సాగు చేసేందుకు అధిక మంది రైతులు ఆసక్తి చూపలేదు. జిల్లా వ్యాప్తంగా తక్కువ విస్తీర్ణంలో సాగైంది. దీంతో దిగుబడి కూడా తక్కువగా వస్తోంది. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేదు. ఈ నేపథ్యంలో దోస కాయల రేటు విపరీతంగా పెరిగింది. ఈ ఏడాదంతా ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
తెగుళ్లను అధిగమిస్తే.. లాభాలు
దోస పంటకు ఆశించే అన్ని రకాల తెగుళ్ల నుంచి కాపాడుకుంటే.. ఈ రెండు నెలల్లో వచ్చే దిగుబడికి అధిక ధరలు ఉండి సిరులు కురిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం మొదటి కోతలో టన్ను రూ.22 వేల నుంచి 24 వేల వరకు ధర పలుకుతోంది. రైతులకు లాభాలు తెచ్చి పెడుతున్నాయి. జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో గత 5 ఏళ్లు 3900 ఎకరాలకు పైగా సాగు చేశారు. ఈ ఏడాది 3500 ఎకరాలు సాగు చేసినట్లు తెలుస్తోంది. ఏటా సెప్టెంబర్ నుంచి మార్చి వరకు సాగు చేస్తుంటారు. మల్చింగ్ షీట్‌పై పండించే దోస పంటకు విత్తనాలకే అధిక పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దుక్కుల నుంచి దిగుబడి చేతికి వచ్చే వరకు అన్నీ కలిపి ఎకరాకు రూ. 60 వేల వరకు పెట్టుబడి అవుతుంది. తెగుళ్లను అధిగమించి దిగుబడి వస్తే లక్ష రూపాయల వరకు ఆదాయం ఉంటుంది. అందువల్ల రైతులు దోస పంటపై ఆసక్తి చూపుతున్నారు. అయితే పెట్టుబడి అధికం అవుతుండటంతో కొంత మంది వెనకడుగు వేస్తున్నారు. పెట్టుబడికి అవసరమయ్యే అంత డబ్బున్న వారు ఈ పంటపై మక్కువ చూపుతున్నారు. రెండవ కోతలో టన్ను రూ.14 వేల నుంచి 23 వేల వరకు పలికే అవకాశం ఉంటుందని అంటున్నారు. పంటను కాపాడుకుంటే ఈ నెలతోపాటు ఏప్రిల్‌లో అధిక ధర పలికే అవకాశం ఉంటుంది. పంటకు రైతులు సస్యరక్షణ చర్యలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
రైల్వేకోడూరు మండలం బొజ్జావారిపల్లెలో సాగు చేసిన దోస పంట
నియోజకవర్గం దోస (ఎకరాల్లో..)
తక్కువ కాలంలోనే దిగుబడి
ఈ ఏడాది దిగుబడి చేతికి వచ్చిన ప్రారంభ దశలోనే దోస పంట అధిక ధర పలుకుతూ లాభాలు తెచ్చి పెడుతోంది. జిల్లా వ్యాప్తంగా అధికంగా రైల్వేకోడూరు నియోజకవర్గంలో పండిస్తున్నారు. రాయచోటి, పీలేరు, రాజంపేట, మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో కూడా కొంత మేర సాగు చేశారు. సాధారణంగా రైతులు దోస పంటను తక్కువ సమయంలో దిగుబడి చేతికొచ్చి.. లాభాలు చూడవచ్చన్న కొండంత ఆశతో పండిస్తుంటారు. దుక్కులు, బోదెలుకట్టడం, మల్చింగ్‌షీట్, డ్రిప్ ఎరువులు అన్నీ కలిపి ఎకరాకు రూ.60 వేలకు పైగా పెట్టుబడి అవుతుంది. అయినా కేవలం రెండు నెలల్లో దిగుబడి, లాభాలు వస్తాయనే ఉద్దేశంతో రైతులు దోస పంట పండిస్తారు.
రైల్వేకోడూరు 2210
రాయచోటి 480
రాజంపేట 179
మదనపల్లి 125
పీలేరు 230
తంబళ్లపల్లి 708
మార్చి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. జనం చల్లని పా
మార్చి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. జనం చల్లని పా
మార్చి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. జనం చల్లని పా
మార్చి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. జనం చల్లని పా
Comments
Please login to add a commentAdd a comment