విజయం సులువు | - | Sakshi
Sakshi News home page

విజయం సులువు

Published Wed, Mar 5 2025 1:47 AM | Last Updated on Wed, Mar 5 2025 1:43 AM

విజయం

విజయం సులువు

ప్రణాళికతో చదువు..

సంబేపల్లె: విద్యార్థి జీవితానికి పదో తరగతి కీలక మలుపు. ఉన్నత విద్యకు, ఆ తర్వాత బంగారు భవిష్యత్తుకు పునాది. ఇది దృఢంగా ఉండాలంటే పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలి. ప్రణాళిక ప్రకారం చదువుతూ.. ఉపాధ్యాయులు చెప్పిన మెలకువలు పాటిస్తే.. ఇదేమంత కష్టం కాదంటున్నారు నిపుణులు. మార్చి 17 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ముందస్తు ప్రిపరేషన్‌ కోసం సబ్జెక్టు నిపుణుల అభిప్రాయాలతో ప్రత్యేక కథనం.

సమయం లేదు మిత్రమా ..

పది పరీక్షలకు దాదాపు రెండు వారాల సమయం మాత్రమే వుంది. పరీక్షలు ఎలా రాయాలి. ఉత్తమ మార్కులు సాధించేందుకు ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి, ఏ పాఠ్యాంశాలను రివిజన్‌ చేసుకోవాలి? వంటి అంశాలపై ఆయా సబ్జెక్టు టీచర్ల సలహాలు, సూచనలు తీసుకోవాలంటున్నారు నిపుణు లు. ముఖ్యమైన అంశాలపై పట్టు బిగిస్తే ఉత్తమ మా ర్కులతో ఉత్తీర్ణత సాధించవచ్చునని చెబుతున్నారు. అలాగే ‘తెలుగులో దోషాలుండొద్దు.. హిందీలో నిబంధ్‌పై పట్టుండాలి.. ఆంగ్లంలో ఎడిటింగ్‌ ము ఖ్యం, జీవన చిత్రాలపై తర్ఫీదు అవసరం, తికమక పడొద్దు.. సూత్రాల లెక్క తప్పొద్దు.. చరిత్ర తెలుసుకోవాలి’ అంటున్నారు.. ఆయా సబ్జెక్టు టీచర్లు.

జిల్లాలో పదో తరగతి విద్యార్థుల వివరాలు

మొత్తం విద్యార్థులు: 24,310

ప్రభుత్వ, జెడ్పీ హైస్కూల్‌ వారు:

12,559

మున్సిపల్‌ హైస్కూళ్లు,

రెసిడెన్సీ హైస్కూళ్లు: 2,126

ఆదర్శ పాఠశాలలు: 1484

కేజీబీవీ: 799

ప్రైవేటు ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ : 7413

మదరసా: 20

ఇతరులు, ఓరియంటల్‌,

మినీగురుకులాలు: 909

ఇలా రాస్తే మంచిది

ప్రశ్నలను ఒకటికి రెండు సార్లు చదివి అర్థం చేసుకున్నాకే రాయాలి. సమాధాన పత్రంలో పేజీకి 15 నుంచి 16 లైన్లు వుండాలి. మొదటి వరుసలో ఎంత బాగా రాశారో, చివరి వరకు అదే గుండ్రని అక్షరాలతో కొనగాగించాలి.

–శశికళా, ఉపాధ్యాయిని

సూత్రాలపై పట్టు సాధించాలి

ప్రతి పాఠంలోనూ సూత్రాలపై పట్టు సాధిస్తే పరీక్షల్లో వచ్చే ప్రశ్నలకు సులువుగా సమాధానాలు రాయవచ్చు. బహుపదులు, వృత్తాలు, ఉపరితల వైశాల్యాల్లో పటాలు గీయడంపై సాధన చేయాలి. త్రికోణమితీయ, సర్వసమీకరణల ఉపరితల వైశాల్యాల పట్టికలపై సాధన అవసరం. – ఇ.రెడ్డప్పరెడ్డి, గణిత ఉపాధ్యాయుడు

హిందీలో సులభంగా మార్కులు

హిందీలో సులభంగా ఎక్కువ మార్కులు సాధించవచ్చు. సెక్షన్‌–1లో 12 ఐచ్చిక వ్యాకరణ సంబంధిత ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్‌–3లో ఓ కవి పరిచయంపై ఐదు మార్కులు ఉంటాయి. పరిచయం పేరాను చదివి ఖాళీలు పూరించాలి.

–మోహినీసా నదామి, హిందీ టీచర్‌

నిరంతర సాధన

రెయిమ్స్‌, స్కిమ్‌, ఫానెటిక్స్‌ను చదివితే సులువుగా ప్రశ్నలకు జవాబులు రాయవచ్చు. ఎడిటింగ్‌, ప్యాసేజ్‌ అంశాలపై పట్టు సాధించాలి. యాక్టీవ్‌ వాయిస్‌, ప్యాసీవ్‌ వాయిస్‌, రిపోర్టెట్‌ స్వీచ్‌ అంశాలపై చదవాలి. ప్యాసేజ్‌ అంశాలపై పట్టు సాధించాలి. ఒకాబులరీ గ్రామర్‌కు టెక్స్‌టూల్‌ను నిరంతర సాధన చేయాలి. – దేవప్రసాద్‌రెడ్డి, ఇంగ్లిష్‌ ఉపాధ్యాయుడు

హెడ్డింగ్‌లు, సబ్‌హెడ్డింగ్‌లు పెట్టాలి

సాంఘిక శాస్త్రంలో అత్యధిక మార్కులు సాధించడానికి పట నైపుణ్యాలపై పట్టు సాధించాలి. ప్రపంచ పటాన్ని ఖండాల వారీగా సాధన చేయాలి. 8 మార్కుల ప్రశ్నలకు జవాబులను విస్తృతంగా రాయాల్సి ఉంటుంది. వీటికి హెడ్డింగ్‌లు, సబ్‌హెడ్డింగ్‌లు పెట్టడం ద్వారా ఉత్తమ మార్కులు సాధించవచ్చు. – ఎం.నరసింహారెడ్డి,

ప్రభుత్వ పాఠ్యపుస్తక రచయిత,

ప్రధానోపాధ్యాయుడు, సంబేపల్లె జెడ్పీ పాఠశాల

అర్థవంతంగా చదవాలి

జీవశాస్త్రంలో ప్రయోగాలు, పట్టికలు, పటాలపై పట్టు సాధిస్తే గరిష్ట మార్కులు సాధించవచ్చు. పాఠ్యపుస్తకాన్ని అర్థవంతంగా చదువుతూ.. ఏమవుతుంది, ఊహించి రాయండి, సూచనలు ఇవ్వండి, నినాదాలు రాయండి, ప్రశ్నించండి వంటి ప్రశ్నలకు సన్నద్ధం కావాలి. కిరణజన్య సంయోగక్రియలోని ప్రయోగాలు, ప్రత్యుత్పత్తి పాఠశాలలోని బొమ్మలపై పూర్తి శ్రద్ధ పెట్టాలి.

– ఓబుల్‌రెడ్డి, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు

త్వరలో పదో తరగతి పరీక్షలు

సబ్జెక్టుల వారీగా అవగాహన అవసరం

మెలకువలు పాటిస్తే.. అధిక మార్కులు

అక్షర దోషాలు లేకుంటే మేలు

తెలుగులో దోషాలు లేకుండా సమాధానాలు రాస్తే 20 శాతం మార్కులు సులువుగా సాధించవచ్చు. పద్యభాగంలో కవి పరిచయం, గద్యంలో ప్రక్రియలు, లేఖ, కరపత్రం అంశాలు, చందస్సులో వృత్త పద్యాలపై పశ్నలు వస్తాయి. విశ్వామిత్రుడు, మారీచుడు, సుగ్రీవుడు, దశరథుడు వంటి అంశాలతోపాటు రామాయణం, ప్రాశస్త్యం, సీతారామకల్యాణం వంటి అంశాలపై పట్టు సాధిస్తే అధిక మార్కులు సొంతం చేసుకోవచ్చు. –ఎ.సుశీల, తెలుగు ఉపాధ్యాయురాలు,

ఆదర్శ పాఠశాల, సంబేపల్లె మండలం

No comments yet. Be the first to comment!
Add a comment
విజయం సులువు 1
1/8

విజయం సులువు

విజయం సులువు 2
2/8

విజయం సులువు

విజయం సులువు 3
3/8

విజయం సులువు

విజయం సులువు 4
4/8

విజయం సులువు

విజయం సులువు 5
5/8

విజయం సులువు

విజయం సులువు 6
6/8

విజయం సులువు

విజయం సులువు 7
7/8

విజయం సులువు

విజయం సులువు 8
8/8

విజయం సులువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement