వలస వెళ్లకుండా పనులు కల్పించండి
రామాపురం: గ్రామాల్లో వలసలు వెళ్లకుండా ఉపాధి పనులు కల్పించాలని అన్నమయ్య జిల్లా డ్వామా పీడీ వెంకటరత్నం పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని రాచపల్లె, నల్లగుట్టపల్లె పంచాయతీల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం కూలీలకు 150 రోజుల పని దినాలు కల్పిస్తోందన్నారు. కూలి గిట్టుబాటు అయ్యే విధంగా చూడాలని మండల అధికారులకు సూచించారు. అనంతరం రాచపల్లె గ్రామంలో పశువుల షెడ్లు, ఫారంపాండ్లు, నల్లగుట్టపల్లెలో పశువుల నీటి కుంటలను పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీఓ పెంచయ్య, ఈసీ శివయ్య, టీఏ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.
సారా రహిత
గ్రామాలుగా మార్చాలి
తంబళ్లపల్లె: మండలంలోని గ్రామాలను సారా రహితంగా తీర్చిదిద్దాలని ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని కోటకొండతండాలో ములకలచెరువు ఎకై ్సజ్ సీఐ మాధవి ఆఽధ్వర్యంలో మంగళవారం నవోదయం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారా అమ్మకాలు చట్టరీత్యా నేరమన్నారు. సారా వల్ల కలిగే అనర్థాలు, యువత పెడదోవ పట్టే విధానాన్ని వివరించారు. నవశకానికి నాంది పలుకుదామని గ్రామస్తులతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జోగేంద్ర, తహసీల్దార్ హరికుమార్, ఎంఈఓ త్యాగరాజు, సర్పంచు తులశమ్మ తదితరులు పాల్గొన్నారు.
కౌమార దశలో
సాధికారతే లక్ష్యం
నిమ్మనపల్లె: కౌమార దశలోని బాల, బాలికల్లో సాధికారతను సాధించడమే కిశోరి వికాసం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జిల్లా శిశుగృహ మేనేజర్ సుప్రియ అన్నారు. మంగళవారం ఎంపీడీవో పరమేశ్వర్‌రెడ్డితో కలిసి మహిళా సంరక్షణ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15–18 ఏళ్ల వయసులోని బాల బాలికలను రెండు గ్రూపులుగా విభజించి, బాలికల కోసం సఖి, బాలుర కోసం యువ గ్రూపులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి గ్రూప్‌లోను కనీసం ఐదుగురు నుంచి 14 మంది సభ్యులను చేర్చాలని సూచించారు. కార్యక్రమంలో సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శులు పాల్గొన్నారు.
మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
రాయచోటి అర్బన్: అన్ని రంగాల్లో మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి తెలిపారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక సాయి ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళా పోలీసులు, కళాశాల విద్యార్థినులతో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఏదైనా సమస్య వస్తే పోలీసులను ఆశ్రయించాలన్నారు. పోలీసుల సహాయం కోసం డయల్ 100 లేదా 112కు ఫోన్ చేయాలన్నారు. మహిళా హెల్ప్‌లైన్ నంబర్ 181కి కాల్ చేయాలన్నారు. కార్యక్రమంలో రాయచోటి మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ రవిశంకర్‌రెడ్డి, ఎస్‌ఐ బి.శ్రీనివాస్ నాయక్, కళాశాల ఏడీ సుధాకరరెడ్డి, కళాశాల ఉమెన్స్ సెల్ కోఆర్డినేటర్ విశాలాక్షి, అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు సునీత, అరుణతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.
వలస వెళ్లకుండా పనులు కల్పించండి
వలస వెళ్లకుండా పనులు కల్పించండి
వలస వెళ్లకుండా పనులు కల్పించండి
Comments
Please login to add a commentAdd a comment