ధరలు స్థిరంగా ఉంటే లాభాలు
దోస పంటను పండించడానికి పెట్టుబడి అధికంగా ఉంటుంది. నేను 4 ఎకరాల్లో దోస పంట సాగు చేశాను. టన్ను రూ.22 వేలతో వ్యాపారస్తులు కొని ఎగుమతి చేసుకొన్నారు. ఇదే విధంగా ఈ నెల అంతా ధరలు ఉంటే రైతులకు అధిక లాభాలు వస్తాయి.
– కందుల మల్లికార్జునరెడ్డి, రైతు,
రాఘవరాజపురం, రైల్వేకోడూరు
గతేడాది అంతా నష్టాలే
గతేడాది దోస పంట తెగుళ్ల బారిన పడి భారీగా నష్టం వచ్చింది. ఈ ఏడాది కూడా సాగు చేశాను. ఈ ఏడాది విత్తనాలు, కవర్లు ఇలా అన్నీ ధరలు పెంచారు. కాబట్టి పెట్టుబడి కూడా అధికం అయ్యింది. దోస కాయల ధరలు ఇలాగే కొనసాగితే లాభాలు వస్తాయి.
–సుంకర మురళి, రైతు, సత్రం, రైల్వేకోడూరు
ధరలు అధికంగా ఉండే అవకాశం
గతేడాది నష్టాలు రావడంతో ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు దోస పంట సాగుపై ఆసక్తి చూపలేదు. తెగుళ్లను అధిగమిస్తే నాణ్య తను బట్టి ఈ ఏడాది ధరలు బాగా పలికే అవకాశం ఉంది. రైతులు, వ్యాపా రుల లాభాలు గడించనున్నారు. –కంభం మల్లికార్జునరెడ్డి,
వ్యాపారి, కేసీ అగ్రహారం
సస్యరక్షణ చర్యలు పాటించాలి
దోస పంటకు తెగుళ్లు అధికంగా వస్తాయి. రైతులు సస్యరక్షణ చర్యలు పాటించాలి. ఇష్టం వచ్చినట్లు మందులు పిచికారీ చేస్తే నష్టపోయే ప్రమాదం ఉంది. అధికారుల సూచనలు, సలహాలు పాటించాలి. –వెంకటభాస్కర్,
ఉద్యానశాఖ అధికారి, రైల్వేకోడూరు
ధరలు స్థిరంగా ఉంటే లాభాలు
ధరలు స్థిరంగా ఉంటే లాభాలు
ధరలు స్థిరంగా ఉంటే లాభాలు
Comments
Please login to add a commentAdd a comment