నేటి నుంచి లెంట్‌డేస్ ప్రారంభం
రాజంపేట టౌన్ : క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలతో నలభై రోజుల పాటు చేపట్టనున్న లెంట్‌డేస్ (శ్రమకాలపు దినాలు) బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గుడ్‌ఫ్రైడేకి నలబై రోజుల ముందు వచ్చే భస్మ బుధవారంతో లెంట్‌డేస్ ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఏప్రిల్ 18వ తేదీ గుడ్‌ఫ్రైడే కావడంతో లెంట్‌డేస్ నిర్వహణకు ఆయా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనల కోసం ఏర్పాట్లు చేశారు. అనేక మంది ఈ నలభై రోజులు ఎక్కువగా చర్చిలో గడుపుతారు. చర్చిలకు వెళ్లలేని వారు ఇంటి వద్దనే ఉంటూ ప్రార్థనలు చేసుకుంటారు.
40 రోజులు ఉపవాసాలతో
ప్రార్థనలు చేయనున్న క్రైస్తవులు
Comments
Please login to add a commentAdd a comment