ఒంటిమిట్ట : ఒంటిమిట్ట కోదండరామాలయంలో ధ్వజస్తంభం, బలిపీఠం, ఇత్తడి రేకు తొడుగు మార్పు పనులపై కేంద్ర పురావస్తుశాఖ అధికారులు నేటికీ అనుమతులు ఇవ్వలేదు. బుధవారం నుంచి మహా సంప్రోక్షణ ఉత్సవాలు జరగనుండగా పురావస్తు శాఖ జీర్ణోద్ధరణ పనులు పూర్తి చేసింది. అయితే ఒంటిమిట్ట రామాలయంలో ధ్వజస్తంభం, బలిపీఠం, స్వర్ణ రంగు పొయ్యి అంద వికారంగా దర్శనమిస్తున్నాయి. వాటిని స్వర్ణ రంగుతో తీర్చిదిద్దేందుకు పురావస్తు శాఖ అనుమతులు వస్తాయనుకున్న టీటీడీ అధికారులు ధ్వజ స్తంభం చుట్టూ ఇనుప పైపులతో సారవ కట్టించారు. కాగా కేంద్ర పురావస్తుశాఖ అధికారుల ఆదేశాల మేరకు మరమ్మతులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సంబంధిత టీటీడీ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment