వైభవం..ధ్వజారోహణం
గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. స్వామివారి బ్రహోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన గురువారం ఉదయం మూలవర్లకు స్నపన తిరుమంజనం జరిపారు. బ్రహోత్సవాలు జరిగే పదిరోజుల పాటు ఆలయానికి, ఉత్సవాలకు, యజ్ఞయాగాలకు సంరక్షణగా ముక్కోటి దేవతలు ఉండాలని కోరుకొంటూ వారిని ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు. ఈసందర్భంగా గరుత్మంతునికి భక్తిశ్రద్ధలతో నైవేద్యం సమర్పించారు. అనంతరం నైవేద్యంగా ఉంచిన ప్రసాదాలను సంతానం లేని మహిళలు స్వీకరిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. తర్వాత ఊంజల్ సేవ జరిపారు. వాహన మండపంలో స్వామివారిని అందంగా అలంకరించి హంసవాహనంపై కొలువు దీర్చారు. గ్రామ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అఽధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
ఆలయంలో నేడు:
శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజైన శుక్రవారం ఉదయం ముత్యపుపందిరివాహనం, సాయంకాలం సింహవాహన సేవలు ఉంటాయని ఆలయ అర్చకులు గోపాలబట్టార్ తెలిపారు. ఇదే రోజు ఉదయం స్నపన తిరుమంజనం, ఊంజల్‌సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment