మహిళాభివృద్ధికి కృషి చేద్దాం
ఓపెన్ హౌస్ ప్రారంభోత్సవంలో
ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
రాయచోటి : మహిళల భద్రత, రక్షణ,అభివృద్ధి, సాధికారతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈనెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా 1 నుంచి 8వ తేది వరకు మహిళా సాధికారత వారోత్సవాలను జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరుపుతున్నట్లు ఎస్పీ తెలిపారు. అలాగే ఎస్పీ కార్యాలయాన్ని విద్యార్థునులు సందర్శించేలా, మహిళా గౌరవాన్ని పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున జిల్లా కేంద్రంలో ర్యాలీని నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు. వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను ర్యాలీ అనంతరం ప్రదానం చేస్తామన్నారు.
విద్యార్థునులతో మమేకమై.....
ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని తిలకించేందుకు వివి ధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థినులతో జి ల్లా ఎస్పీ, పోలీసు అధికారులు మమేకమయ్యా రు. విధి నిర్వహణలో పోలీసులు వినియోగిస్తున్న వివిధ రకాల అత్యాధునిక ఆయుధాల గురించి, బాంబ్ డిస్పోజల్స్ పరికరాలు, సాంకేతికత గురించి వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఐ రవిశంకర్ రెడ్డి, ఆర్‌ఐలు విజె రామకృష్ణ, ఎం పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment