సర్టిఫికెట్ల అందజేత
గుర్రంకొండ : గుర్రంకొండ తెలుగు జెడ్పీహైస్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులకు డీఈవో సుబ్రమణ్యం ఎస్‌జీఎఫ్ జాతీయస్థాయి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. 2024–2025 సంవత్సరానికి స్థానిక తెలుగు హైస్కూల్లో తొమ్మిదో తరగతికి చెందిన ప్రసన్నకుమార్, మేకల సంతోష్ జమ్మూకాశ్మీర్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి ఫెన్సింగ్ క్రీడా పోటీల్లో పాల్గొని రాష్ట్రానికి పతకాలు తీసుకొచ్చారు. ఈనేపథ్యంలో డీఈవో సుబ్రమణ్యం గురువారం విద్యార్థులను తన కార్యాలయానికి రప్పించుకొని సర్టిఫికెట్లను అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ మన జిల్లాకు చెందిన విద్యార్థులు రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించడం శుభపరిణామన్నారు. క్రీడల్లో విద్యార్థుల ఉన్నతికి కారణమైన పీడీ రమేష్‌బాబు, కోచ్ రవీంద్రలను డీఈవో అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment