● బాలలు, మహిళల హక్కులే లక్ష్యం
మదనపల్లె సిటీ: సాయం చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు లలితమ్మ. మదనపల్లె పట్టణానికి చెందిన ఈమె లింగవిక్షకు గురైన బాధితురాలే. పెద్ద చదువులకు వెళ్లాలనుకున్నా పదో తరగతిలోనే చదువును ఆపాల్సి వచ్చింది. గాంధీ గ్రామీణాభివృద్ధ్ది సంస్థలో బాల్వాడీ టీచర్‌గా పని చేసేందుకు 1990లో ములకలచెరువు వెళ్లారు 1992 తంబళ్లపల్లె చేరుకుని అక్కడే పీపుల్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్(ఫోర్డు) స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. బాల్యవివాహాలను రూపుమాపడమే కాకుండా బడిమానేసిన వారికి తిరిగి పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ, వాటర్ ఎయిడ్ ఇండియా, అమెరికాకు చెందిన చైల్డ్ రైట్స్ యు (క్రై) సంస్థలు ఆర్థిక చేయూత ఇవ్వడంతో బాలలు, మహిళల హక్కుల కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment