No Headline
వైఎస్సార్ జిల్లా చింతపూతాయపల్లె గ్రామానికి చెందిన చల్లగాలి మంజులారాణి కష్టతరమైన భావాలను గీతల్లో పలకించే విలక్షణ చిత్రకారిణి. భర్త గొల్లపల్లి జయన్న రాష్ట్ర ప్రభుత్వ హంస అవార్డు పొందిన చిత్ర, శిల్పకారుడు కావడంతో ఆమె తన ప్రతిభకు మెరుగులు దిద్దుకుంది. ప్రత్యేక శైలిగల చిత్రకారాణిగా ఆమె ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉనికిని చాటుకున్నారు. మహిళా సమస్యలను ప్రతిబింబించేలా ప్రతీకాత్మక చిత్రాలను గీయడం మంజులారాణికి రంగులతో పెట్టిన విద్య, మరీ ముఖ్యంగా మాతృత్వం తొణికిసలాడే అమ్మ చిత్రాలు, మురిపాలు ఆస్వాదిస్తూ తన్మయత్వంలో మునిగిన చిన్నారుల చిత్రాలు ఆమె చిత్రాలకు సంతకాలుగా నిలుస్తున్నాయి. ఆమె పలు జాతీయ, అంతర్జాతీయ చిత్ర కళా ప్రదర్శనల్లో పాల్గొని బహుమతులను సాధించారు.యువ చిత్రకారులను ప్రోత్సహిస్తున్నారు.
ఆమె చిత్రం అపురూపం
No Headline
No Headline
Comments
Please login to add a commentAdd a comment