No Headline
కమలాపురం: ప్రస్తుత సమాజంలో రక్త సంబంధీకుల మృతదేహాలను చూసేందుకు జంకుతున్న తరుణంలో నేను సైతం అంటూ అనాథ మృత దేహాలకు అంత్య క్రియలు చేసేందుకు ముందుకు వస్తున్నారు కమలాపురం పట్టణం, కె. అప్పాయపల్లెకు చెందిన పాల మేరీ సునీత... కరోనా సమయంలో ఎవరైనా మృతి చెందితే సొంత కుటుంబ సభ్యులే చూసేందుకు ముందుకు రాని సందర్భాల్లో సునీత తన భర్త భూపాళం వెంకట లక్ష్మణ్ కుమార్ ప్రోత్సాహంతో అభి ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ విజయ్ బాబు సహకారంతో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ధైర్యంగా ముందుకు వచ్చారు. కరోనా కష్టకాలంలో 8 మంది మహిళల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. విజయ్ బాబు స్థాపించిన ట్రస్ట్‌లో 2021లో సభ్యురాలిగా చేరారు. ఎక్కడైనా అనాథమృత దేహాలు ఉన్నాయనే సమాచారం వస్తే సునీత తన భర్త లక్ష్మణ్, సోదరుడు కరుణాకర్, ట్రస్ట్ చైర్మన్ విజయ్‌బాబుతో కలసి అక్కడికి చేరుకుని మృతి చెందిన వారి మతాను సారం అంత్యక్రియలు నిర్వహిస్తూ, మానవత్వం చాటుతూ ముందుకు సాగుతున్నారు. ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇప్పటి వరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మృతి చెందిన 42 మంది పేద, అనాధ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఎక్కడైనా అనాథ మృతదేహాలు ఉంటే తమకు సమాచారం ఇస్తే వచ్చి ఉచితంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని చెబతోంది పాల మేరీ సునీత.
మేరీ.. సేవా నారీ
No Headline
Comments
Please login to add a commentAdd a comment