No Headline
పీలేరు: పీలేరు పట్టణానికి చెందిన మాజీ సైనికుడు టి. ప్రభాకర్‌రెడ్డి కుమార్తె టి. హోత్రిశ్రీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. చిన్నతనం నుంచే బ్మాడింటన్‌పై పట్టు సాధించి అనేక విజయాలు సొంతం చేసుకుంది. తండ్రి ప్రోత్సాహంతో గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి క్రీడాకారిణిగా గుర్తింపు పొందుతోంది. ఆమె తండ్రి ప్రభాకర్‌రెడ్డి జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. తన ఆరవ ఏటలోనే బ్యాడ్మింటన్‌లో అడుగుపెట్టిన హోత్రిశ్రీ 2017లో గోపిచంద్ అకాడమీలో జరిగిన జాతీయ స్థాయి సబ్ జూనియర్ పోటీల్లో పతకం గెలుపొందింది. రాజమండ్రిలో అండర్–15 విభాగంలో రాష్ట్ర చాంపియన్‌గా నిలిచింది. 2018లో నెల్లూరులో అండర్–14 విభాగంలో మినీ బ్యాడ్మింటన్ చాంపియన్‌గా నిలిచింది.2019లో ప్రొద్దుటూరు, బెంగళూరులో సౌత్‌జోన్ పోటీల్లో పాల్గొని ప్రశంసాపత్రాలను అందుకుంది. 2019లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అబ్దుల్ కలాం పురస్కారాన్ని స్వీకరించింది.2021లో బెంగళూరులో జరిగిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ చాంపియన్‌షిప్ పోటీల్లో విజేతగా నిలిచింది.
● 2024 సెప్టెంబరులో కడప జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో మెరుగైన ప్రదర్శన కనబరచి చైన్నెలో జరిగే సౌత్‌జోన్ పోటీలకు ఎంపికై నంది. ప్రస్తుతం కేఎంఎం ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతోంది. అంతర్జాతీయ స్థాయి బ్మాడ్మింటన్ క్రీడాకారిణిగా రాణించాలన్నదే తన లక్ష్యమని హోత్రిశ్రీ చెబుతోంది.
బ్యాడ్మింటన్ రాకెట్.. హోత్రిశ్రీ
Comments
Please login to add a commentAdd a comment