కురబలకోట : మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ తమ ఔన్నత్యాన్ని చాటాలని జిల్లా ఎస్పీ వి. విద్యా సాగర్ నాయుడు పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఆయన అంగళ్లు మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిఽథిగా పాల్గొన్నారు. ర్యాలీని ప్రారంభించారు. అంతకు ముందు అక్కడి ఆడిటోరియంలో జరిగిన సభలో మాట్లాడుతూ సమాజంలో సమస్యలు సహజమని స్వశక్తి (సెల్ప్ కనెక్షన్), వృత్తి నైపుణ్యం ఉంటే ఎలాంటి ఒడుదుడుకులైనా ఎదుర్కోవచ్చన్నారు. విద్య, అక్షరాస్యతకు తేడా ఉందన్నారు. వృత్తిలో జీవితంలో రాణించాలంటే తల్లిదండ్రులు, గురువులు, అనుభవజ్ణుల సూచనలు పాటించడం ద్వారా బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చన్నారు. మహిళలతో పాటు ఎవరికై నా సమస్య లేదా వేధింపులు ఉంటే పోలీస్ శాఖను సంప్రదించడానికి వెనుకాడవద్దన్నారు. ఇప్పటికే అన్నమయ్య జిల్లా వాట్సప్ గ్రూప్‌ను ఏర్పాటు చేయడంతో పాటు అవగాహన కార్యక్రమాలు పోస్టు చేయడం జరుగుతోందన్నారు. త్వరలో భరోసా అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. డీఎస్పీ కొండయ్య నాయుడు, త్రిపుల్ ఆర్ అకాడమీ ప్రెసిడెంట్ నాదేళ్ల ద్వారకనాధ్, ప్రిన్సిపాల్ యువరాజ్, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
స్కిల్ సెట్‌తో సమస్యలను అధిగమించవచ్చు
మహిళా దినోత్సవంలో
జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడు
Comments
Please login to add a commentAdd a comment