ముత్యపు పందిరి వాహనంపై శ్రీలక్ష్మీనరసింహుడు
గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ముత్యపు పందిరి వాహనంపై ఘనంగా ఊరేగించారు. స్వామివారి బ్రహోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయాన్నే స్వామివార్లకు తిరుచ్చి, శుద్ధి తోమాలసేవ, ఏకాంతసేవలు నిర్వహించారు. స్నపన తిరుమంజనం కావించి ఊంజల్‌సేవ నిర్వహించారు. వాహన మండపంలో స్వామివారి వాహనాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. అనంతరం స్వామివార్లను హనుమంత వాహనంపై కొలువు దీర్చి గ్రామపురవీధుల గుండా ఊరేగించారు. కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు స్వాములు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment