అగ్ని ప్రమాదంలో మామిడి, అల్లనేరేడు తోటలు దగ్ధం
నిమ్మనపల్లె : గుర్తు తెలియని వ్యక్తులు బీడు పొలాల్లో నిప్పు పెట్టడంతో చెలరేగిన మంటలు భారీ అగ్ని ప్ర మాదానికి కారణమయ్యాయి. పూత దశలోని మామి డి తోటలు, అల్ల నేరేడు చెట్లు, నీటి పైపులు, డ్రిప్పు పైపులు, కేబుల్ వైర్లు అగ్నికి ఆహుతై రైతులు తీవ్రంగా నష్టపోయారు. శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాద వివరాలు ఇలా..మండలంలోని బోడుమల్లయ్యగారి పల్లి సమీపంలో ఉన్న ఓబులేసుని కొండ వద్ద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బీడు భూముల్లో నిప్పు అంటించారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి చుట్టూ వ్యాపించాయి. రైతులు నరేంద్ర, ఖాసిం ఖాన్, భావాఖాన్, నిజాముద్దీన్ మంటలను గుర్తించారు. కొంతమంది రైతుల సాయంతో మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. ఓవైపు మంటల ఆర్పుతున్నా, మరోవైపు గాలి ప్రభావానికి వేగంగా మంటలు వ్యాప్తి చెంది,రైతుల శ్రమ వృథా అయింది. వాల్మీకిపురం ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. అగ్ని ప్రమాదంలో రైతు నరేంద్రకు చెందిన ఐదు ఎకరాల్లో మామిడి తోట, 45 అల నేరేడు చెట్లు నూరి మీటర్ల నీటి పైప్ లైన్, 100మీటర్ల కేబుల్ వైర్, మరో రైతు బావా ఖాన్ కు చెందిన పూత దశలో ఉన్న ఏడు ఎకరాల మామిడి తోట పూర్తిగా దెబ్బతింది. మొత్తంగా సుమారు 12 ఎకరాల్లోని మామిడి తోట, మామిడి తోటకు చుట్టూ వేసిన కంచె, మంటల్లో కాలిపోయింది. కంచె కోసం ఏర్పాటు చేసిన స్తంభాలు దెబ్బతిన్నాయి. పూత దశలోని మామిడి చెట్లు అగ్ని ప్రమాదానికి గురై కాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సమాచారం అందుకున్న తహసిల్దార్ అమర్నాథ్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రమాదంలో నష్టం వివరాలను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని రెవిన్యూ అధికారులు తెలిపారు.
బీడు పొలాల్లో నిప్పు పెట్టిన
గుర్తుతెలియని వ్యక్తులు
12 ఎకరాల్లోని మామిడి,
45 అల్లనేరేడు చెట్లు దగ్ధం
Comments
Please login to add a commentAdd a comment