
నేడు ఒంటిమిట్టకు టీటీడీ చైర్మన్ రాక
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయానికి ఆదివారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రానున్నారు. ఈ విషయాన్ని ఆలయ డిప్యూటీ ఈఓ నటేష్‌బాబు శనివారం తెలిపారు. మహా సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. మూలవిరాట్‌ను దర్శించుకున్న అనంతరం వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి సీతారాముల కల్యాణోత్సవ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని నటేష్‌బాబు తెలిపారు.
ప్రభుత్వ వైద్యుడు సస్పెన్షన్
పెనగలూరు: పెనగలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ నిమృచిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈమేరకు పెనగలూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఉత్తర్వులు వచ్చాయి. మరోక డాక్టర్ తౌసిఫ్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు సమాచారం. వైద్యులు సమయానికి విధులకు హాజరుకాకపోవడంతో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సస్పెండ్ చేశారు.
నేడు జూడో జట్టు ఎంపికలు
పెనగలూరు: ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 9 గంటలకు పెనగలూరు మండలం, ఇన్ ఫ్యాంట్ జీసస్ స్కూల్ ఆవరణలో జిల్లాస్థాయి జూడో జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా జూడో కార్యదర్శి వెంకటేష్ తెలిపారు. జూని యర్ బాల బాలికల విభాగానికి 2005 నుంచి 2010 లోపు జన్మించిన వారు మాత్రమే అర్హులన్నారు. ఇందులో ఎంపికై న వారు విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియంలో ఈనెల 15, 16వ తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. వివరాలకు 98482 67126 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
నేడు అవగాహన సదస్సు
కడప కల్చరల్: భారత జాతీయ కళాసంస్కృతి వారసత్వ పరిరక్షణ సంస్థ (ఇన్ టాక్ )ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు కడప ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో సిరి ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఇన్ టాక్ కన్వీనర్ లయన్ కె.చిన్నపరెడ్డి వెల్లడించారు. ప్రముఖ ఆహార ఆరోగ్య శాస్త్రవేత్త పద్మశ్రీ డాక్టర్ ఖాదర్ వలీ ప్రధాన వక్తగా హాజరై ,చిరుధాన్యాలతో కలిగే ప్రయోజనాలపై సంపూర్ణ అవగాహన కల్పిస్తారని ఆయన వివరించారు. కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తదితరులు అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు .ఈ సమావేశంలో కడప ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
లోక్ అదాలత్‌లో
240 కేసుల పరిష్కారం
రాయచోటి టౌన్: రాయచోటి కోర్టులో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు.మొత్తం 240 కేసులను పరిష్కరించారు. కక్షిదారులకు రూ.1,86,40.095లు అందజేసినట్లు రాయ చోటి జిల్లా 5వ అదనపు న్యాయమూర్తి కృష్ణన్‌కుట్టి తెలిపారు. రాయచోటి డివిజన్‌లోని అన్ని పోలీసు స్టేషన్ల నుంచి పోలీసు అధికారులు వారి పరిధిలోని కేసుల పరిష్కారం కోసం లోక్‌అదాలత్‌కు వచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఈ. ప్రసూన న్యాయవాదులు పాల్గొన్నారు.
రాష్ట్ర అనుబంధ విభాగాల్లో నియామకాలు
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు దిగువ పేర్కొన్న అన్నమయ్య జిల్లాకు చెందిన నాయకులను రాష్ట్ర అనుబంధ విభాగాలలో వివిధ హోదాల్లో నియమిస్తున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా రేవతి బీరంజి, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శిగా జి. చంద్రమౌళి, రాష్ట్ర మేధావుల పోరం కార్యదర్శిగా వీఎస్ రెడ్డిలను నియమించారు.
వైఎస్సార్ జిల్లాలో..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ జిల్లాకు చెందిన పలువురిని రాష్ట్ర అనుబంధ విభాగాలలో వివిధ హోదాలలో నియమిస్తున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర మహిళా విభాగం జాయింట్ సెక్రటరీలుగా జి. క్రిష్ణవేణిరెడ్డి, మూలే సరస్వతి దేవి, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శులుగా ఎం. రామమోహన్‌రెడ్డి, ఎస్. వీర గంగుల వీర ఆంజనేయులు, కార్యదర్శిగా రాయల్‌బాబు, రాష్ట్ర మేధావుల ఫోరం ప్రధాన కార్యదర్శిగా వీవీ సుబ్రమణ్యం రావు, కార్యదర్శులుగా పోచిమరెడ్డి సుబ్బారెడ్డి, ఓ. వేణుగోపాల్‌లను నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment