యువతను వంచించిన చంద్రబాబు
రైల్వేకోడూరు అర్బన్ : ఎన్నికల ముందు యువత, నిరుద్యోగులు, విద్యార్థులకు మాయమాటలు చెప్పి హామీలు ఇచ్చి అధికారం చేపట్టాక చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేష్‌లు యువత, నిరుద్యోగులను నయవంచన చేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవారం ఈనెల 12న జరిగే యువత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది అవుతున్నా ఒక్కహామీ ఊసు కూడా లేదన్నారు. యువత, విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు ఆడుకొంటున్నారని ధ్వజమెత్తారు. ఫీజు ఈ ఎంబర్స్‌మెంట్ లేక విద్యార్థుల చదువులు కుంటు పడుతున్నాయని తెలిపారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యం ఇచ్చి, ఫీజు రీ ఎంబర్స్‌మెంట్, అమ్మ ఒడి, నాడునేడు, ఇంగ్లీష్ మీడియం ఇలా చదువుకు అండగా ఉండి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిందని తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తమకు వద్దని కేంద్రానికి తెలియజేసిన ఏకై క ముఖ్యమంత్రి చంద్రబాబేనని విమర్శించారు. యువత, నిరుద్యోగుల కోసం ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించి, నిరుద్యోగులకు రూ.2000 నిరుద్యోగ భృతి ఇవ్వకుంటే చొక్కా పట్టుకోవాలని లోకేష్ నాడు సభల్లో చెప్పాడని, అలాగే కూటమి చెప్పే మాటలకు తాను హామీగా ఉండి ప్రశ్నిస్తానన్న ఉప ముఖ్యమంత్రి పవనన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లాడని ప్రశ్నించారు. చంద్రబాబు వంచనకు నిరసనగా ఈనె 12న రాయచోటిలో జరిగే నిరసన, కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు యలగచెర్ల శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీటీసీ రత్నమ్మ, రమేష్, మందల నాగేంద్ర, అన్వర్‌బాషా, తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి, కౌరెడ్డి సిద్దయ్య, ఉమామహేశ్వర్‌రెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,
మాజీ ఎమ్మెల్యే కొరముట్ల
Comments
Please login to add a commentAdd a comment