అత్యాచారం కేసులో నిందితుల అరెస్టు
మదనపల్లె : నిమ్మనపల్లె మండలంలో ఓ వివాహితపై అత్యాచారం చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు మదనపల్లె రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ తెలిపారు. సోమవారం స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం నిమ్మనపల్లి మండలం తవళం గ్రామం నాయనవారిపల్లెకు చెందిన ఓ వివాహిత (21) పాలు పోసేందుకు తమ గ్రామం నుంచి పక్కనే ఉన్న నల్లంవారిపల్లెకు వెళ్లి డిపోలో పాలు పోసి తిరిగి వస్తుండగా, నల్లంవారిపల్లెకు చెందిన పి.రమణ కుమారుడు పల్లపు నాగేంద్ర (23), డి.వెంకటరమణ కుమారుడు దేవర ఇంటి సురేంద్ర (33), కాపు కాచి బాధితురాలిపై అత్యాచారం చేశారు. ఆ సమయంలో జరిగిన విషయం బయటకు చెబితే బాధితురాలిని, ఆమె భర్తను చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో బాధిత మహిళ వారం రోజుల తర్వాత నిమ్మనపల్లె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో, డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు సూచనలతో కేసు దర్యాప్తు చేశామన్నారు. నిందితులను సోమవారం అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment