టీడీపీ ‘బెల్ట్’ మద్యంపై ఎస్‌ఐ వేటు!
కురబలకోట : ముదివేడు ఎస్‌ఐ దిలీప్‌కుమార్ బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించారు. బెల్ట్ మద్యం విక్రయిస్తూ ఇద్దరు పట్టుబడినట్లు ఎస్‌ఐ సోమవారం తెలిపారు. పి. సుబ్రమణ్యం (65), జి. వెంకట్రమణ (60) మండలంలోని కంటేవారిపల్లె వద్ద అధిక ధరలకు మద్యం అమ్ముతుండగా పట్టుకున్నట్లు తెలిపారు. మద్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ బెల్ట్ మద్యాన్ని అంగళ్లులోని సూరి వైన్స్, రుద్ర వైన్స్ నుంచి కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. దీంతో మద్యం షాపు ఓనర్లు, టీడీపీ నాయకులు సూరి, బాలకృష్ణను కూడా నిందితులుగా చేర్చి కేసు నమోదు చేశామన్నారు. బెల్ట్ షాపుల వ్యవహారంలో అధికార టీడీపీ మద్యం షాపు ఓనర్లపై కూడా కేసు నమోదు కావడంతో ఆ పార్టీ శ్రేణులు ఉలిక్కి పడుతున్నాయి. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ఎక్కడైనా మద్యం బెల్ట్ షాపులు ఉన్నట్లయితే 9440900705 మొబైల్ నెంబరుకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు.
మద్యం షాపు ఓనర్లపైనా కేసు నమోదు
మరో ఇద్దరి అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment