ఇష్టపడి చదివితేనే ఉత్తీర్ణత
సిద్దవటం : బీసీ వసతి గృహంలో ఉండి చదువుకునే విద్యార్థులు క్రమశిక్షణతో, ఇష్టపడి చదివితే అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించగలరని జిల్లా బీసీ సంక్షేమాధికారి భరత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సిద్దవటం మండలం పార్వతీపురంలో ఉన్న బీసీ బాలుర వసతి గృహంలో మంగళవారం రాత్రి 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి నైతిక విలువలను పెంచుకోవాలన్నారు. 10వ తరగతి విద్యార్థులు ఏకాగ్రతతో చదివి మంచి మార్కులను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌పీబీవీడి సభా హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఎం.డి. మధుసూదన్, తెలుగు పండిట్ పోలిరెడ్డి, ఉపాధ్యాయులు, జిల్లా బీసీ వెల్ఫేర్ కార్యాలయం సూరింటెండెంట్ ఆంజనేయులు, స్థానిక వసతి గృహం అధికారి రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment