● దేవుడా.. ఇదేం ‘పరీక్ష’
బి.కొత్తకోట : బి.కొత్తకోటలో పదవ తరగతి విద్యార్థి తీవ్రంగా గాయపడి కాలు కదపలేని స్థితిలో మంచంపై పరీక్షా కేంద్రానికి హాజరైన ఉదంతం ఇది. సోమవారం పదవ తరగతి పరీక్షలు ప్రారంభమై మొదటి రోజు తెలుగు పరీక్ష నిర్వహించారు. మండలలోని ఆకులవారిపల్లెకు చెందిన లహిత్‌కుమార్‌రెడ్డి గట్టు జెడ్పీ హైస్కూల్‌లో పదవ తరగతి పూర్తి చేయగా స్థానిక మోడల్ స్కూల్ పరీక్షా కేంద్రంలో పరీక్షలకు హజరుకావాల్సి వుంది. ఆయితే విద్యార్థి లహిత్‌కుమార్‌రెడ్డి శనివారం బైక్‌పై ఆకులవారిపల్లె నుంచి గట్టుకు వస్తుండగా హైస్కూల్ వద్ద ప్రమాదానికి గురయ్యాడు. కుడి కాలుకు తీవ్ర గాయాలు కావడంతో కాలంతా కట్టు కట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి పరీక్షలు రాయాల్సి ఉండటంతో కుటుంబ సభ్యులు కారులో స్కూల్‌కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి పరీక్షా కేంద్రంలోకి మోసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో మంచంపై తీసుకెళ్లారు. విద్యార్థి పరిస్థితి గమనించిన నిర్వాహకులు ఉపాధ్యాయుల విశ్రాంతి గదిలో పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించారు. అయితే రాసేందుకు వీలుకావడం లేదని చెప్పడంతో ఓ తొమ్మిదో తరగతి విద్యార్థిని సహాయంగా నియమించడంతో లహిత్‌కుమార్‌రెడ్డి పరీక్ష పూర్తి చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment