● నా పేరుతో ఇల్లు.. బిల్లులు ఎవరికో ఇచ్చి..
నా పేరు జి.రామక్క. నా పేరుతో గత ప్రభుత్వం ఇల్లు నిర్మించుకునేందుకు మంజూరు చేసింది. అయితే స్థోమత లేక అప్పట్లో ఇల్లు కట్టుకోలేదు. ఇప్పుడు ఇల్లు కట్టుకొందామని అధికారుల దగ్గరకు వెళ్లి అడిగితే.. ఎప్పుడో ఇల్లు కట్టుకున్నానని దానికి బిల్లులు కూడా తీసుకున్నావని చెప్పుతున్నారు. నా బ్యాంక్ పాస్ బుక్, రికార్డులు తీసుకెళ్లి చూస్తే బిల్లులు పడినట్లు లేదు. మళ్లీ అడిగితే మళ్లీ అదే సమాధానం, ఎవరికి వేశారో రికార్డులు చూపాలని కోరితే నా పేరు జి.రామక్క అయితే.. సీ రామక్క అనే పేరుతో బిల్లులు వేసినట్లు రికార్డులు చూపెట్టారు. అయితే ఆమె ఎక్కడుందో చెప్పితే ఆమె దగ్గరకు వెళ్లి అడుగుతానని కోరితే.. ఎక్కడుందో వారికి తెలియదంటా. అది నేనే తెలుసుకొని వారి దగ్గరికి తీసుకెళ్లాలంట. ఆమె ఎవరో ఏ జిల్లాలో ఉందో నాకెలా తెలుస్తుంది. బిల్లులు ఇచ్చిన అధికారులకు వారి ఇచ్చిన పేపర్ల ఆధారంగా చూడొచ్చు కదా.. డబ్బులు వాళ్లు ఇచ్చి.. ఆమె ఎవరో నేను తెలుసుకొని తీసుకురమ్మంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment