నాటు బాంబుల కేసులో నలుగురు బైండోవర్
పీలేరు రూరల్ : వేరుశనగ రక్షణ కోసం నాటు బాంబులు, విద్యుత్ తీగలు ఏర్పాటు చేసిన కేసులో నలుగురు నిందితులను బైండోవర్ చేసినట్లు సీఐ యుగంధర్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అగ్రహారం పంచాయతీ ఎనుములవారిపల్లెకు చెందిన కౌలు రైతు గుట్టమీద వెంకటేశ్వర్‌రాజు ఒక ఎకరా వేరుశనగ సాగు చేశాడు. పంట రక్షణకు పొలం చుట్టూ విద్యుత్ తీగలతోపాటు నాటు బాంబులు ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం అడవిపంది నాటుబాంబు పేలి మృతి చెందింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులకు అందిన సమాచారంతో ఎనుమలవారిపల్లెకు చెందిన గుట్టమీద వెంకటేశ్వర్‌రాజు, జయచంద్రారెడ్డి, ఎస్. భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రాజులను బుధవారం స్థానిక తహసీల్దార్ భీమేశ్వర్‌రావు ఎదుట బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment