
పూర్తయిన పనులను ఉగాది రోజున ప్రారంభించాలి
● జిల్లా కలెక్టర్ శ్రీధర్
రాయచోటి: పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో పూర్తయిన పల్లె పండుగ పనులను ఉగాది రోజున ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, హౌసింగ్ శాఖ సిబ్బంది, వీఆర్‌ఓలు, సర్వే సిబ్బంది, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖ సిబ్బంది తదితరులతో పీజీఆర్‌ఎస్ ద్వారా అందిన అర్జీలు, రెవెన్యూ సదస్సుల ద్వారా అందిన అర్జీలు, రీ సర్వే, ఇళ్లపట్టాల రీ వెరిఫికేషన్, పల్లె పండుగ కార్యక్రమాలు, ఎన్టీఆర్ హౌసింగ్, పి–4 సర్వే తదితర అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పూర్తయిన పల్లె పండుగ పనుల ప్రారంభోత్సవానికి ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకొని ఉగాది రోజున ప్రారంభించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డీఆర్‌ఓ మధుసూదన్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, అన్ని మండలాల తహశీల్దార్లు, ఎంపీడీఓలు, హౌసింగ్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
యువతకు ఉచిత శిక్షణ
కడప కోటిరెడ్డిసర్కిల్: డీడీయూ జీకేవై ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, జూనియర్ సాఫ్ట్‌వేర్ వెబ్ డెవలపర్, బ్యూటీషియన్ కోర్సు ల్లో 4 నెలలపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని అడ్మిషన్స్ కో–ఆర్డినేటర్ హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. 18–35 ఏళ్లలోపు కలిగి టెన్త్ ఉత్తీర్ణులై ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ పాస్ లేదా ఫెయిల్ అయిన వారు ఇందుకు అర్హులని పేర్కొన్నారు. కడప నగరంలోని నిహార్ స్కిల్ సెంటర్‌లో శిక్షణ ఇస్తామన్నారు. ఈనెల 24 నుంచి బ్యాచ్ ప్రారంభిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment