హద్దులు దాటిన.. డ్యాన్స్
కురబలకోట : ముదివేడు అమ్మవారి తిరునాలలో డ్యాన్స్ హద్దులు దాటింది. భక్తి భావం ఉప్పొంగాల్సిన చోట అసభ్యకర నృత్యంతో హోరెత్తించారు. కురబలకోట మండలం ముదివేడు దండుమారెమ్మ రాత్రి తిరునాల సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించకూడదని ముందస్తుగా పోలీసులు హెచ్చరించినా కొందరు ఖాతరు చేయలేదు. మండలంలోని నడింపల్లె, గోల్లపల్లె గ్రామాల్లో బుధవారం రాత్రి హద్దులు దాటి యథేచ్ఛగా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారు. ఈ దృశ్యాలను కొందరు సెల్ ఫోన్‌లో రికార్డ్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విషయం తెలుసుకుని చాందినీబండి నిర్వాహకుడు నడింపల్లె అశోక్‌పై వివిధ సెక్షన్ల కింద నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ దిలీప్‌కుమార్ గురువారం తెలిపారు. వారు ఉపయోగించిన డీజే సౌండ్ సిస్టమ్, ఇతర వాహనాలను సీజ్ చేసి కందూరుకు చెందిన కార్తీక్, డిజే వెహికల్ డ్రైవర్ గురునాథ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ముదివేడు తిరునాలలో రికార్డింగ్ డ్యాన్సులు
ముగ్గిరిపై కేసు నమోదు...వాహనాలు సీజ్
Comments
Please login to add a commentAdd a comment