అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్తు షాక్
ఒంటిమిట్ట : మండలంలోని సాలాబాద్ గ్రామంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఒంటిమిట్ట ఎస్‌ఐ శివప్రసాద్ వివరాల మేరకు.. సాలాబాద్‌లో ట్రాన్స్‌ఫార్మర్ పనులు చేస్తున్నారు. లైన్‌మెన్ జనార్థన్‌రెడ్డి ఆదేశాలతో సాలాబాద్ 33/11 కె.వి.సబ్ స్టేషన్‌లో ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యంరెడ్డి ఎల్‌సీ ఇచ్చారు. అనంతరం బీహార్‌కు చెందిన రిడీసాయి ఎలక్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్మికుడు మున్నాధావన్(23) ట్రాన్స్‌ఫార్మర్ పనులు చేసేందుకు విద్యుత్తు స్తంభం ఎక్కాడు. ఎల్‌సీ ఇచ్చిన సుబ్రహ్మణ్యంరెడ్డి షిప్ట్ మారడంతో రెండో ఆపరేటర్‌గా వచ్చిన సుధాకర్‌రాజు లైన్‌మెన్ జనార్థన్‌రెడ్డి, ఆపరేటర్ సుబ్రహ్మణ్యంరెడ్డిని సంప్రదించకుండా విద్యుత్ చార్జ్ చేశారు. దీంతో ఆ సమయంలో ట్రాన్స్‌ఫార్మర్ పనిచేస్తున్న ధావన్‌కు షాక్ తగలడంతో కరెంట్ పోల్ పైనే కుప్పకూలాడు. అప్రమత్తమైన సిబ్బంది 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించి ప్రథమ చికిత్స అందిచారు. అనంతరం బాధితుడిని మెరుగైన చికిత్స కోసం తిరుపతి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. లైన్‌మెన్, ఆపరేటర్ల మధ్య సమన్వయ లోపమే ఈ ప్రమాదానికి కారణమని సూపర్‌వైజర్ మనోహర్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు చేయడంతో లైన్‌మెన్ జనార్దన్‌రెడ్డి, ఆపరేటర్లు సుబ్రహ్మణ్యంరెడ్డి, సుధాకర్‌రాజులపై కేసు నమోదు చేసినట్లు ఒంటిమిట్ట ఎస్‌ఐ శివప్రసాద్ తెలిపారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వలస కార్మికుడు
లైన్‌మెన్, ఇద్దరు ఆపరేటర్లపై కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment