ఉపాధిలో అక్రమాలకు పాల్పడితే చర్యలు
లక్కిరెడ్డిపల్లి : ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని డ్వామా పీడీ వెంకటరత్నం అన్నారు. 2023–24లో జరిగిన ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ నిర్వహించారు. అనంతరం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో సోషల్ ఆడిట్ సభ నిర్వహించారు. తనిఖీల్లో ఎక్కువగా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని 16 పంచాయతీలలో రూ.43,243, ఏపీడీ తనిఖీలో రూ.1,91,425 ఇప్పటి వరకూ రికవరీ చేశారని సిబ్బంది పీడీకీ తెలిపారు. డీఆర్సీలు, ఉపాధి సిబ్బంది భారీ ముడుపులు తీసుకున్నారని తనిఖీ సిబ్బంది వెల్లడించారు. డ్వామా పీడీ ఆమట్లాడుతూ ఇష్టానుసారంగా నిధులు దుర్వినియోగం చేశారని ఉపాధి సిబ్బందిపై మండిపడ్డారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ఒక్కొక్క పంచాయతీ నుంచి డిఆర్సీలకు ముడుపులు ముట్టినట్లు క్షేత్ర స్థాయి సిబ్బంది చెబుతున్నారన్నారు. ఈ విషయంపై వివరణ కోరుతూ ఈసీ వెంకటాలపతి, కంప్యూటర్ ఆపరేటర్ పవన్ నాయక్, టీఏ విజయదుర్గా, ప్రసాద్ రాఘవేంద్రలకు పీడీ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఏపీఓ జిల్లీ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ నందకుమార్‌రెడ్డి, వాటర్ షెడ్ ఏపీడీ లక్ష్మీ నరసయ్య, ఇన్‌చార్జ్ ఎంపీడీఓ ఉషారాణి, ఏపీడీఓ డిల్లీబాబు, టీఏలు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment