వెలిగల్లు శుద్ధి జలాలను సద్వినియోగం చేసుకోవాలి
– జెడ్పీ సీఈఓ ఓబులమ్మ
గాలివీడు : వెలిగల్లు శుద్ధి జలాలను సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ సీఈఓ ఓబులమ్మ కోరారు. మండలంలోని వెలిగల్లు జలాశయం వద్ద వివిధ దశల్లో జరుగుతున్న నీటి శుద్ధి ప్రక్రియ పనులను ఆమె గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈ కృష్ణకుమార్, అధికారులతో ఆమె సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ వెలిగల్లు జలాశయం నుంచి వెలువడే నీరు శుద్ధి చేసిన అనంతరం స్వచ్ఛంగా ఉన్నాయని, అవగాహనా రాహిత్యంతో వృథా చేయడం సరికాదన్నారు. రానున్న వేసవి దష్ట్యా ప్రజలు ప్రతి నీటి బొట్టు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎక్కడైనా స్కీం బోర్లలో సమస్యలు తలెత్తున్నాయా అనే విషయంపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జవహర్‌బాబు, లక్కిరెడ్డిపల్లి డీఈ విద్య, జేఈ ప్రదీప్, కృష్ణయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
వరాహానికి
ఏనుగు లాంటి పిల్ల జననం
ఒంటిమిట్ట : మండలంలోని పెద్దకొత్తపల్లిలో ఓ వరాహానికి ఏనుగు లాంటి పందిపిల్ల జన్మించింది. గ్రామస్థుల వివరాల మేరకు.. మూడు రోజుల కిందట పెద్దకొత్తపల్లిలో ఓ వరాహానికి తొమ్మిది పిల్లలు జన్మించాయి. అందులో ఎనిమిది పంది పిల్లలు ఒకలా ఉంటే, ఒకటి మాత్రం ఏనుగు తొండాన్ని వేసుకొని విచిత్రంగా ఉంది. దీంతో పోతులూరి వీరబ్రహ్మం చెప్పిన మాటలు నిజమవుతున్నాయంటూ గ్రామంలో చర్చ మొదలైంది. కొందరు పంది పిల్లను చూసేందుకు ఎగబడ్డారు. బుధవారం ఆ పందిపిల్ల మృతి చెందడంతో హిందూ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు చేశారు.
పక్కా గృహాల నిర్మాణం వేగవంతం
– హౌసింగ్ పీడీ సాంబశివయ్య
గాలివీడు : 2019–24 మధ్యకాలంలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని హౌసింగ్ పీడీ సాంబశివయ్య కోరారు. మండలంలోని వెలిగల్లు ఎస్సీ ,ఎస్టీ కాలనీల్లో అసంపూర్తిగా ఉన్న పక్కా గృహాలను ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, బీసీలకు ప్రభుత్వం రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు అదనపు మొత్తం మంజూరు చేస్తోందని, వెంటనే ఇల్లు నిర్మించుకోవాలని సూచించారు. పనులు మొదలుపెట్టిన వెంటనే బిల్లులు ఇస్తారన్నారు. అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.350 కోట్లు మంజూరు చేసింన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ బుక్కే రమే ష్‌నాయక్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ పాల్గొన్నారు.
వెలిగల్లు శుద్ధి జలాలను సద్వినియోగం చేసుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment