
22న కుల, చేతివృత్తుల సంఘాల నేతల సమావేశం
రాయచోటి అర్బన్: ఈ నెల 22వ తేదీన జిల్లాలోని బీసీ కులాల చేతి, కులవృత్తుల సంఘాల నేతలతో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్. జయసింహా ఒక ప్రకటనలో తెలిపారు. రాయచోటి పట్టణంలోని ఎంపీడీఓ సభాభవనంలో నిర్వహించే సమావేశంలో ఆదరణ–3 పథకం కింద అవసరమైన కుల, చేతివృత్తి పనిముట్లకు నేతల సలహాలు, సూచనలను స్వీకరించనున్నామన్నారు. సమావేశానికి నాయిబ్రహ్మణులు, రజకులు, వడ్డెరలు, మత్స్యకారులు, చేనేత, స్వర్ణకారులు, వడ్రంగులు, పాల వ్యాపారం, కల్లు గీత కార్మికులు, కుమ్మర, మేదర, వాల్మీకి, బోయ , కృష్ణ బలిజ, పూసలు, సగర, ఉప్పర తదితర కులాల నేతలతో పాటు శిల్పి, కరెంటు, ప్లంబింగ్ తదితర చేతివృత్తుల వారు హాజరు కావాలన్నా రు.
26 నుంచి అన్నమయ్య 522వ వర్ధంతి కార్యక్రమాలు
రాజంపేట: ఈనెల 26 నుంచి తాళ్లపాక, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల 522 వ వర్ధంతి కార్యక్రమాలను టీటీడీ నిర్వహించనుంది. ఈ మేరకు బుధవారం వర్ధంతి కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేశారు. 26న తాళ్లపాకలో నగర సంకీర్తన, గోష్ఠిగానం, అన్నమాచార్య సంకీర్తన, హరికథ కార్యక్రమాలు ఉంటాయి. 27, 28, 29న అన్నమాచార్య సంకీర్తన, హరికథలు ఉంటాయి. అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద రెండురోజుల పాటు మాత్రమే వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య సంకీర్తన, హరికథలు నిర్వహించారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో ఆధ్యాత్మిక సంగీత సభలను నిర్వహిస్తారు.
జూడాల సంఘం
నూతన కమిటీ ఏర్పాటు
కడప అర్బన్: ప్రభుత్వ వైద్య కళాశాల జూనియర్ డాక్టర్ల సంఘం (జీఎంఎస్‌కె– జూడా) కొత్త కమిటీ ఏర్పాటైంది. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. సురేఖ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. విజయభాస్కర్ రెడ్డి కొత్త కమిటీని అభినందించారు. అధ్యక్షుడిగా ఎన్నికై న డాక్టర్ ఎస్. విష్ణు వర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ బి. విజయ్, డాక్టర్ చరిత, డాక్టర్ పూజ, డాక్టర్ ప్రతిభ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎ. నిఖిల్ సింగ్, డాక్టర్ సుబ్బారెడ్డి కళాశాలలోని సమస్యల గురించి వినతిపత్రం అందజేశారు. కళాశాల సమస్యల గురించి ప్రస్తావించారు. సానుకూలంగా స్పందించిన ప్రిన్సిపల్ వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
దూరవిద్య కోర్సుల ప్రవేశానికి
దరఖాస్తుల స్వీకరణ
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ (సీడీవోఈ) ద్వారా పలు కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 30 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి తెలిపారు. బుధ వారం ఆయన ప్రిన్సిపల్ ఎస్ రఘునాథరెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. పద్మ తో కలిసి మాట్లాడారు. వైవీయూ గుర్తింపునిచ్చిన అధ్యయన కేంద్రాల్లో ఎంఏ ఎకనామిక్స్, ఇంగ్లీష్, హిస్టరీ, జర్నలిజం, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, తెలు గు, ఎం కామ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. బ్యాచిలర్ డిగ్రీలో ఎకనామిక్స్ చదివిన వారికి మాత్రమే ఎంఏ ఎకనామిక్స్ లో ప్రవేశాలు ఉంటాయని అలానే బీకాం, బీబీఏ, బీబీఎం డిగ్రీ చేసిన వారు ఎంకామ్‌లో ప్రవేశాలకు అర్హులన్నారు. మిగిలిన అన్ని కోర్సులకు ఏదేని డిగ్రీ పాసైతె చాలన్నారు. ఈ ఏడాది నూతనంగా బ్యాచిలర్ ఆఫ్ ఫైనార్ట్స్ ( బీఎఫ్ ఏ ఆనర్స్) మ్యూజిక్ నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ప్రారంభించామన్నారు. ఈ కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్, సమాన అర్హత గల వారు ప్రవేశానికి అర్హులన్నారు.

22న కుల, చేతివృత్తుల సంఘాల నేతల సమావేశం

22న కుల, చేతివృత్తుల సంఘాల నేతల సమావేశం
Comments
Please login to add a commentAdd a comment